ఐసీసీ ర్యాంకుల్లో షెఫాలీ అగ్రస్థానం
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మహిళా బ్యాటర్ షెఫాలీ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానికి చేరుకున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 22 బంతుల్లో 23 పరుగులు, రెండో టీ20లో 31 బంతుల్లో 47 పరుగులు చేసింది. దీంతో షెఫాలీ ర్యాంకింగ్ పాయింట్లు మెరుగుపడి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత నెంబర్ 1 స్థానానికి తొలి సారి చేరుకున్న షెఫాలీ.. తర్వాత ర్యాంక్ పోగొట్టుకుంది. తాజాగా మరో […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మహిళా బ్యాటర్ షెఫాలీ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానికి చేరుకున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 22 బంతుల్లో 23 పరుగులు, రెండో టీ20లో 31 బంతుల్లో 47 పరుగులు చేసింది. దీంతో షెఫాలీ ర్యాంకింగ్ పాయింట్లు మెరుగుపడి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత నెంబర్ 1 స్థానానికి తొలి సారి చేరుకున్న షెఫాలీ.. తర్వాత ర్యాంక్ పోగొట్టుకుంది. తాజాగా మరో సారి అగ్రస్థానాని చేరుకున్నది. ఇప్పటి వరకు టాప్ ర్యాంకులో ఉన్న బెత్ మూనీ రెండో స్థానానికి పడిపోయింది. వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యూమౌంట్ అగ్రస్థానికి చేరుకున్నది. ఇక ఇండియాపై వన్డే సిరీస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాని ఎగబాకింది.
మహిళల టీ20 ర్యాంకింగ్స్
బ్యాటర్స్
1. షెఫాలీ వర్మ
2. బెత్ మూనీ
3. సోఫీ డివైన్
4. మెగ్ లాన్నింగ్
5. అలీసా హేలీ
బౌలర్లు
1. సోఫియా ఎక్లిస్టోన్
2. షబ్నిమ్ ఇస్మాయేల్స
3. సారా గ్లెన్
4. మేగన్ షట్
5. జెస్ జోనాస్సెన్
ఆల్‌రౌండర్లు
1. సోఫీ డివైన్
2. నటాలీ షివర్
3. ఎల్లిస్ పెర్రీ
4. దీప్తి శర్మ
5. స్టెఫానీ టైలర్
వన్డే ర్యాంకింగ్స్
బ్యాటర్లు
1. టామీ బ్యూమౌంట్
2. లిజెల్లీ లీ
3. మెగ్ లాన్నింగ్
4. స్టెఫానీ టేలర్
5. అలీసా హేలీ
బౌలర్లు
1. జెస్ జోనాస్సెన్
2. మరిఝానే కాప్
3. మేఘన్ షట్
4. షబ్నిమ్ ఇస్మాయేల్
5. జులన్ గోస్వామి
ఆల్‌రౌండర్లు
1. ఎల్లీస్ పెర్రీ
2. మరిఝానే కాప్
3. స్టెఫానీ టేలర్
4. నటాలీ షివర్
5. దీప్తి శర్మ