షాద్ నగర్ ను వణికిస్తోన్న ఆ ఇద్దరు

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని షాద్ నగర్ పట్టణంలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో షాద్ నగర్ లో మొబైల్ పరీక్షా కేంద్రం ద్వారా రక్త పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్య అధికారి చందు నాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అంత్యక్రియల్లో పాల్గొనడంతో.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కరోనా చాప కింద […]

Update: 2020-05-23 23:05 GMT

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని షాద్ నగర్ పట్టణంలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో షాద్ నగర్ లో మొబైల్ పరీక్షా కేంద్రం ద్వారా రక్త పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్య అధికారి చందు నాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.

అంత్యక్రియల్లో పాల్గొనడంతో..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కరోనా చాప కింద నీరులగా కనిపిస్తోన్నది. గత రెండు రోజుల క్రితం పట్టణానికి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతడిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతనితో కలసి తిరిగినా వారిలో 22 మందిని సెలక్ట్ చేసి పరీక్షలు నిర్వహించాగా మరో యువకుడికి కూడా కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడం పట్టణ ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేస్తోందనే చెప్పవచ్చు. గత వారం రోజుల క్రితం హైదరాబాద్ జియాగూడలో వీరు కరోనా వచ్చినా ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పాల్గొన్నారు. వీరితో పాటు మరి కొంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినా అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

Tags:    

Similar News