శ్వేతపత్రం విడుదల చేయాలి : షబ్బీర్ అలీ
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు పెన్షనర్లకూ కోట విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శాసన మండలి సభ్యులు మహ్మద్ షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. ఆకస్మికంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ రాష్ట్ర ఆర్థిక విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ప్రకటనలో డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా ఆర్థిక భారాన్ని పంచుకోవాలంటూ ప్రభుత్వం.. ఉద్యోగులను బలవంతం చేస్తున్నదని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఖర్చు తగ్గించడం గురించి కేసీఆర్ నిజంగా […]
దిశ, న్యూస్‌బ్యూరో:
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు పెన్షనర్లకూ కోట విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శాసన మండలి సభ్యులు మహ్మద్ షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. ఆకస్మికంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ రాష్ట్ర ఆర్థిక విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ప్రకటనలో డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా ఆర్థిక భారాన్ని పంచుకోవాలంటూ ప్రభుత్వం.. ఉద్యోగులను బలవంతం చేస్తున్నదని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఖర్చు తగ్గించడం గురించి కేసీఆర్ నిజంగా అంతగా ఆలోచించి ఉంటే, ఆర్థిక సంక్షోభం ముగిసే వరకు ప్రగతి భవన్‌లో నివసించడం మానేయాలన్నారు.
దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని స్వయంగా సీఎం కేసీఆర్ పలు వేదికలపై ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. వాస్తవ సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. జీతాలు, పెన్షన్లు తగ్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులకు ఎటువంటి ఆర్థిక భారం పడదని తిరిగి భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags: salaries cut down, finacial crisis, corona, Shabbir Ali