ఎంత మోసం.. మహిళా పేరుతో చాటింగ్..ఆపై..!
దిశ, వెబ్డెస్క్: సామాజిక మాధ్యమాల ద్వారా ఎంత మంచి జరుగుతుందో.. అంతే చెడు కూడా జరుగుతుంది. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. చివరికి జైల్లో ఊసలు లెక్కపెడుతున్నారు. ఇటువంటి ఓ ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. పామర్తి సోమేంద్ర అలియాస్ సాయి అనే వ్యక్తి మహిళ పేరుతో నకిలీ ఐడి క్రీయేట్ చేసి బంధువుల అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టాడు. ఆమె యాక్సెప్ట్ చేయడంతో కొంతకాలం మహిళలాగే స్నేహంగా చాటింగ్ […]
దిశ, వెబ్డెస్క్: సామాజిక మాధ్యమాల ద్వారా ఎంత మంచి జరుగుతుందో.. అంతే చెడు కూడా జరుగుతుంది. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. చివరికి జైల్లో ఊసలు లెక్కపెడుతున్నారు. ఇటువంటి ఓ ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. పామర్తి సోమేంద్ర అలియాస్ సాయి అనే వ్యక్తి మహిళ పేరుతో నకిలీ ఐడి క్రీయేట్ చేసి బంధువుల అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టాడు. ఆమె యాక్సెప్ట్ చేయడంతో కొంతకాలం మహిళలాగే స్నేహంగా చాటింగ్ చేయసాగాడు.
తర్వాత ఆమె నగ్న చిత్రాలు పంపాలని లేకుంటే… పోర్న్ సైట్లలో ఫోన్ నెంబర్ పెడతానని బెదిరించాడు. ఆమె నిరాకరించడంతో, ఓ రోజు నగ్నంగా వీడియోకాల్ చేయడమే కాకుండా, ఆమెకు అశ్లీల చిత్రాలు, అసభ్యకర మెసేజ్‌లు పంపాడు. తనతో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని, నగ్నచిత్రాలు పంపాలని వేధింపులకు గురిచేశాడు. వేధింపులకు విసుగు చెందిన ఆమె రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడి గుర్తించగా, అతడు ఆమెకు బంధువు అని తెలియడం గమనార్హం. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.