మోతెలో తీవ్ర అంతరాయం.. రాకపోకలకు
దిశ, కోదాడ: గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పోస్తుండడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. సూర్యాపేట జిల్లా మోతె మండలం పరిధిలోని మామిళ్ళగూడెం నుండి విభళాపురం వెళ్ళే రహదారి పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మోతె మండల పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం […]
దిశ, కోదాడ: గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పోస్తుండడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. సూర్యాపేట జిల్లా మోతె మండలం పరిధిలోని మామిళ్ళగూడెం నుండి విభళాపురం వెళ్ళే రహదారి పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
మోతె మండల పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అనేక వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్నాయని, ఈ రహదారి ఖమ్మం జిల్లా కాకరవాయి వరకు ప్రధాన మార్గంగా ఉందని, మోతె మండల కేంద్రానికి చేరుకోవాలంటే వర్షా కాలమంతా ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వెళ్ళి రావడం ఇబ్బందిగా మారిందని, ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఈ బ్రిడ్జి ఎత్తు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
చాలా రోజుల తరువాత గండ్ల చెరువు అలుగు పోసి వాగు ప్రవహిస్తుండడంతో కొందరు పిల్లలు ఈ దృశ్యాలను చూసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారని, ఆ క్రమంలో పిల్లలు నీళ్లలోకి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.