హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడాకే ఏ మందైనా..
వాషింగ్టన్/న్యూయార్క్: కరోనా మహమ్మారి బారిన పడిన రోగుల చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం కీలకంగా మారింది. మలేరియా చికిత్సలో ఉపయోగించే ఈ డ్రగ్ కొవిడ్-19కి కూడా సమర్థవంతంగా పనిచేస్తోందని కొన్ని పరిశోధనల్లో తేలడంతో అన్ని దేశాలు ఈ మాత్రల దిగుమతిపై దృష్టిపెట్టాయి. ఈ ఔషధాన్ని ఇండియానే అధికంగా ఉత్పత్తి చేస్తుండటంతో అమెరికా, యూరోప్ సహా ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూశాయి. వెంటనే తగినన్ని ఔషధాలు పంపాలని కోరాయి. కొన్ని రోజుల కిందట ఈ ఔషధం వల్ల ప్రయోజనం లేదని.. […]
వాషింగ్టన్/న్యూయార్క్: కరోనా మహమ్మారి బారిన పడిన రోగుల చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం కీలకంగా మారింది. మలేరియా చికిత్సలో ఉపయోగించే ఈ డ్రగ్ కొవిడ్-19కి కూడా సమర్థవంతంగా పనిచేస్తోందని కొన్ని పరిశోధనల్లో తేలడంతో అన్ని దేశాలు ఈ మాత్రల దిగుమతిపై దృష్టిపెట్టాయి. ఈ ఔషధాన్ని ఇండియానే అధికంగా ఉత్పత్తి చేస్తుండటంతో అమెరికా, యూరోప్ సహా ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూశాయి. వెంటనే తగినన్ని ఔషధాలు పంపాలని కోరాయి. కొన్ని రోజుల కిందట ఈ ఔషధం వల్ల ప్రయోజనం లేదని.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఫిర్యాదులు తలెత్తాయి. అయినా సరే ఇప్పటికీ ఈ ఔషధాన్ని వాడిన తర్వాతే ఇతర మందులను వాడుతున్నారట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన మెడికల్ పబ్లికేషన్ సంస్థ ఎండీఎడ్జ్ స్పష్టం చేసింది. ఆర్‌టీ పీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రోగులకు ముందుగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చాకే, రెండో ప్రాధాన్యంగా టొలిసిజుమాబ్‌ను వాడుతున్నారు. అమెరికాలోని యేల్ న్యూ హెవెన్ హెల్త్ సిస్టమ్స్‌లో ఇదే పద్ధతిని పాటిస్తున్నారని తెలిపింది.
మలేరియా వ్యాధిని నయం చేసేందుకు ఏళ్ల తరబడి ఉపయోగించిన హైడ్రాక్సీక్లోరోక్విన్ కొవిడ్-19పై పోరాటంలో గేమ్ ఛేంజర్‌గా మారినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే యేల్ ఆస్పత్రుల్లో ఈ ఔషధాన్ని ఉపయోగించడం మొదలు పెట్టారు. ఈ మాత్రల ధర తక్కువగానే ఉండటం ఒక కారణం కాగా, ఇది వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని అమెరికాలో పని చేస్తున్న భారతీయ డాక్టర్ నిహార్ దేశాయ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని.. సాధ్యమైనంత వరకు ఇదే ఔషధాన్ని ఉపయోగించి నయం చేస్తున్నామని అన్నారు.
Tags: Hydroxychloroquine, Covid 19, Coronavirus, Treatment, America, USA