యాస్ ఎఫెక్ట్.. ప‌లు రైళ్లు క్యాన్సిల్

దిశ, తెలంగాణ బ్యూరో: యాస్ సైక్లోన్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అందులో భాగంగా హౌరా నుంచి హైదరాబాద్ వెళ్లే రైలును ఈ నెల 25 నుంచి 27 వరకు, హైదరాబాద్ టు హౌరా వెళ్లే రైలును 24 నుంచి 26 వరకు రద్దు చేశారు. గౌహతి-సికింద్రాబాద్ రైలును ఈనెల 26న, హౌరా-వాస్కోడా గామా రైలును 25న, వాస్కోడాగామా-హౌరా రైలును 25వ తేదీన రద్దు చేశారు. మైసూర్-హౌరా రైలు 23న, హౌరా-యశ్వంతాపూర్ […]

Update: 2021-05-22 11:19 GMT
దిశ, తెలంగాణ బ్యూరో: యాస్ సైక్లోన్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అందులో భాగంగా హౌరా నుంచి హైదరాబాద్ వెళ్లే రైలును ఈ నెల 25 నుంచి 27 వరకు, హైదరాబాద్ టు హౌరా వెళ్లే రైలును 24 నుంచి 26 వరకు రద్దు చేశారు. గౌహతి-సికింద్రాబాద్ రైలును ఈనెల 26న, హౌరా-వాస్కోడా గామా రైలును 25న, వాస్కోడాగామా-హౌరా రైలును 25వ తేదీన రద్దు చేశారు. మైసూర్-హౌరా రైలు 23న, హౌరా-యశ్వంతాపూర్ రైలు 25న, గౌహతి-యశ్వంతాపూర్ 24న, అగర్తాలా-బెంగళూరు కంటోన్మెంట్ 25న, బెంగళూరు కంటోన్మెంట్-అగర్తాలా 25న, విల్లంపురం-పురాలియా రైలును 26న, విల్లంపురం-ఖరగ్ పూర్ రైలును 25న, ఖరగ్ పూర్-విల్లంపురం రైలును 27వ తేదీన రద్దు చేశారు.

ఎర్నాకులం-హౌరా 24న, యశ్వంతాపూర్-భువనేశ్వర్ 24న, చెన్నై సెంట్రల్-పూరి వెళ్లే రైలును 24న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే బెంగళూరు కంటోన్మెంట్-గౌహతి వెళ్లే రైలును 27, 28 తేదీల్లో రద్దు చేశారు. యశ్వంతాపూర్-ముజఫర్ పూర్ రైలు 26న, యశ్వంతాపూర్-భగల్ పూర్ రైలును 29న, యశ్వంతాపూర్-కమాఖ్య వెళ్లే రైలును ఈనెల 29వ తేదీన రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

slug: Several trains canceled due to cyclone
tags: trains, south central railway, cyclone, yass
Tags:    

Similar News