పిల్లల్ని కనడంతో సరిపోదు.. తల్లిదండ్రులూ మీరిది మరువొద్దంటున్న ‘మోలీ’

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా ‘డిజిటల్ వరల్డ్’‌లోనే కాలాన్ని గడుపుతున్నాం. పెద్దలు తమ తమ బాధ్యతల్లో తలమునకలై ఇంటికి వచ్చి, ఆ తర్వాత మళ్లీ మొబైల్, ల్యాపీల్లోనే తలదూర్చుతున్నారు. అంతేకాదు తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పిల్లలకు కూడా ‘మొబైల్’, ల్యాపీలు అలవాటు చేస్తున్నారు. దీంతో వారి మధ్య బాండింగ్ తగ్గిపోవడంతో పాటు, వారి భవిష్యత్ కూడా దారితప్పుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఏడేళ్ల బుజ్జాయి ‘టెడ్ […]

Update: 2021-07-26 20:38 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా ‘డిజిటల్ వరల్డ్’‌లోనే కాలాన్ని గడుపుతున్నాం. పెద్దలు తమ తమ బాధ్యతల్లో తలమునకలై ఇంటికి వచ్చి, ఆ తర్వాత మళ్లీ మొబైల్, ల్యాపీల్లోనే తలదూర్చుతున్నారు. అంతేకాదు తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పిల్లలకు కూడా ‘మొబైల్’, ల్యాపీలు అలవాటు చేస్తున్నారు. దీంతో వారి మధ్య బాండింగ్ తగ్గిపోవడంతో పాటు, వారి భవిష్యత్ కూడా దారితప్పుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఏడేళ్ల బుజ్జాయి ‘టెడ్ టాక్’ వేదికగా పేరెంట్స్ తమ చిన్నారులను ఎలా పెంచాలి, పాజిటివ్ రిలేషన్స్ వారి ఎదుగుదలకు ఎలా తోడ్పడుతాయో వివరించిన తీరు తల్లిదండ్రులను ఆలోచించేలా చేస్తోంది. ఏడు నిమిషాల స్పీచ్‌తో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన చిల్ర్డన్ మోలీ రైట్ చర్చించిన అంశాలను తెలుసుకుందాం..!

చాలా విషయాల్లో తల్లిదండ్రులు తమకు తెలిసో, తెలియకో చిన్నపిల్లల్ని విస్మరిస్తుంటారు. ‘ఇంకా చిన్నపిల్లలే కదా.. పెద్దయ్యాక వాళ్లే నేర్చుకుంటారులే’ అన్న ధోరణిలో ఉంటారు. తీరా పెరిగాక పిల్లలు తమతో విభేదిస్తున్నారని, ప్రవర్తన సరిగా లేదని, చీటికిమాటికి తమతో గొడవ పడుతున్నారని పేరెంట్స్ కంప్లయింట్ చేస్తుంటారు. అయితే రోజులో కొద్దిసేపైనా పిల్లలతో గడిపుతూ.. నాలుగు మంచి మాటలు చెబితే ఎన్నో సమస్యలు పరిష్కరం కావడంతో పాటు బంధం బలపడుతుందని చెబుతోంది ఏడేళ్ల చిన్నారి మోలీ. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలనే విషయంపై టెడ్‌టాక్‌ వేదికగా ఉద్వేగభరితమైన స్పీచ్ అందించింది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన ‘మోలీ’. టెడ్‌టాక్‌లో మాట్లాడిన అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది. కాగా ఏడు నిముషాల పాటు సాగిన తన ప్రసంగంలో పిల్లలు ఏం కోరుకుంటారో ఉదాహరణలతో సహా వివరించి తల్లిదండ్రులకు ఓ కనువిప్పును కలిగించింది.

‘ఓ తండ్రి గ్యాడ్జెట్ ఉపయోగిస్తూ చాలా బిజీగా కనిపిస్తాడు. అదే సమయంలో పిల్లలు ఆ తండ్రి అటెన్షన్ డ్రా చేయడానికి ప్రయత్నించి విఫలమవుతారు. దీని వల్ల వారిపై ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవడమే కాదు.. ఆ ఇంపాక్ట్ పిల్లలపై జీవితకాలముంటుంది’ అని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది మోలీ. అందుకే బాల్యంలో ఇంటారాక్షన్ చాలా ముఖ్యమని తన చుట్టూ ఉన్నవాళ్లు చాలామంది ఇలాంటివి ఫేస్ చేశారని తెలిపింది. చిన్నారులు కోరుకోనేది మీనింగ్‌ఫుల్ కనెక్షన్స్. వారు తమ కోసం మాట్లాడలేరు కాబట్టి నేను వారి కోసం మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఈ ప్రసంగాన్ని టెడ్‌టాక్ నిర్వాహకులు తమ 30 మిలియన్ల ఫాలోవర్స్‌కు షేర్ చేయడంతో పాటు యునిసెఫ్ కూడా దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి ఆసుపత్రుల్లో కొత్తగా తల్లిదండ్రులైన వారికి ఈ వీడియోను చూపించనున్నారు.

‘ఐదేళ్ల వరకు చిన్నారుల మెదడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆ సమయంలో త్వరగా నేర్చుకుంటారు. అలాగే మానసికాభివృద్ధి.. కనెక్టింగ్, టాకింగ్, ప్లేయింగ్, ఏ హెల్తీ హోమ్, కమ్యూనిటీ అనే ఐదు అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు ‘సర్వ్ అండ్ రిటర్న్’ అని చెబుతుంటారు. ఉదాహరణకు కాపీక్యాట్ గేమ్స్ ఆడటం వల్ల ఇమేజినేషన్, సానుభూతి పెరగుతుంది. నేమింగ్ గేమ్స్ వల్ల వొకాబులరీ, అటెన్షన్ మెరుగుపడతాయి. పీక్- ఏ- బూ’ ఆట ప్రపంచాన్ని మార్చడమే కాదు.. పిల్లల మెదళ్లలో న్యూరాన్‌లను యాక్టివేట్ చేస్తూ జ్ఞాపకశక్తి, నమ్మకాన్ని పెంచడంలో సహాయపడతాయి. మరి పేరెంట్స్ చిన్నారులతో ఆడుతూ, నవ్విస్తూ గడిపే ప్రతీక్షణం ఇద్దరిమధ్య రిలేషన్‌షిప్‌ను పెంచడంతో పాటు మెంటల్‌హెల్త్‌ పెంపొందిస్తుంది. ప్రతి పేరెంట్ ప్రతిచోటా ఇలా చేస్తే ఎంత మార్పు వస్తుందో ఓ సారి ఊహించుకోండి. ఇది పిల్లలకు ఆట కంటే ఈ బాండింగ్ ఎంతో ముఖ్యం. బాలల భవిష్యత్తు, వారి సక్సెస్ తమతో గడిపే క్షణాలపై ఆధారపడి ఉంటుందని పేరెంట్స్ గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు బిజీగా ఉండటంలో తప్పు లేదు. కానీ పిల్లలకు సమయం కేటాయిస్తూ జీవిత నైపుణ్యాల గురించి నేర్పించాలి.

– మోలీ

తల్లిదండ్రులే కాదు ప్రపంచం మొత్తం మోలీ సందేశం వినాలి. ఇలాంటి శక్తివంతమైన ఆలోచన అందించినందుకు చిన్నారికి అభినందనలు. మీరు మీ పిల్లలతో ఆడుతున్నప్పుడు ప్రతీ సెకనుకు ఒక మిలియన్ న్యూరల్ కనెక్షన్లు చర్యలు జరుపుతాయి కాబట్టి పిల్లలతో ఆడటమంటే.. వారి మెదడును తీర్చిదిద్దుతున్నారని అర్థం. మీ బిడ్డ చిరునవ్వు కోసం మీరు ఆనందంగా ఉండాలి. ఇప్పుడు చాలామంది తల్లులు పాలిచ్చేటప్పుడు ఫోన్ వంకే చూస్తూ సోషల్ మీడియాలోనే సమయం గడుపుతున్నారు. పిల్లలతో కనెక్ట్ కావడం లేదు. ఇది తల్లి, బిడ్డల మధ్య ఎఫెక్షన్ తగ్గిస్తుంది.

– ప్రొఫెసర్ దేసిరీ సిల్వా , పీడియాట్రిక్స్ విభాగాధిపతి (జూన్‌డాలప్ హెల్త్ క్యాంపస్‌)

మోలీ రైట్ ప్రస్తుతం క్వీన్స్‌లాండ్‌లో గ్రేడ్ 2 చదువుతోంది. వన్యప్రాణులంటే చాలా ఇష్టం కాగా ఆమె తన తల్లిదండ్రుల సాయంతో ‘వైల్డ్‌లైఫ్ వారియర్స్’ ‌ను ప్రారంభించింది. ఇందులో 40మంది పిల్లలు సభ్యులుండగా, వారంతా కురుంబిన్ వైల్డ్‌లైఫ్ హాస్పిటల్ ఫౌండేషన్ కోసం నిధులు సేకరించడంతో పాటు, వైల్డ్‌లైఫ్ మీద ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సామాజిక సేవకురాలిగా, మంచి వక్తగానూ పేరుతెచ్చుకుంటున్న మోలీ ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్’ కోసం ప్రసంగాలిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

* పిల్లలు పుడుతూనే 100 బిలియన్‌ న్యూరాన్స్‌తో పుడతారు. అందువల్ల చిన్నారులపై ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తే వాళ్లు గుర్తుపడతారు. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం, లాలించడం వల్ల వాళ్లు భద్రత పొందుతారు. ఆ ప్రేమ చిన్నారులకు శక్తిని, సంతృప్తిని ఇస్తుంది.

* మాటలు రాని పిల్లలతో తరుచూ మాట్లాడాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. చిన్నారులు బదులివ్వలేకున్నా కొద్దికొద్దిగా అర్థం చేసుకుంటారని, నెమ్మదిగా వారి మెదడు వికసిస్తుందని చెబుతున్నారు.

* వివిధ రంగుల్ని, బొమ్మలు చూపెడుతూ, దోబూచులాడితే వాటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్నారులు ప్రయత్నిస్తారు. పిల్లల్లో ఇది ఉత్సాహాన్ని పెంచడంతో పాటు, వారి మెదళ్లను ఉత్తేజితం చేస్తుంది.

* తల్లిదండ్రులను చూసే పసివాళ్లు నేర్చుకుంటారు. సున్నితంగా మాట్లాడటం, ఇతరుల కష్టానికి స్పందించడంతో పాటు మంచి పనిచేసినప్పుడు మెచ్చుకోవడం వంటివి చేయాలి. వాటిని చూసే పిల్లలు చైతన్యవంతులౌతారు.

Tags:    

Similar News