సీసమే స్ట్రీట్ మప్పెట్ షో ఇక తెలుగులో!

దిశ, వెబ్‌డెస్క్ : పాశ్చాత్య దేశాల్లో పాపులర్ అయిన చిన్న పిల్లల కార్యక్రమం సీసమే స్ట్రీట్ మప్పెట్ షో.. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి సీసమే వర్క్‌షాప్ రెండు భాషల్లో యూట్యూబ్ చానళ్లను ప్రారంభించింది. ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా నవంబర్ 20న ఈ చానళ్లను ప్రారంభించారు. కొవిడ్ 19 పాండమిక్ కారణంగా పిల్లలు ఇంటికే పరిమితమైన కారణంగా ఆన్‌లైన్ విద్య ఆవశ్యకత పెరిగింది. ఇలాంటి సమయంలో సీసమే స్ట్రీట్ మప్పెట్ […]

Update: 2020-11-26 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పాశ్చాత్య దేశాల్లో పాపులర్ అయిన చిన్న పిల్లల కార్యక్రమం సీసమే స్ట్రీట్ మప్పెట్ షో.. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి సీసమే వర్క్‌షాప్ రెండు భాషల్లో యూట్యూబ్ చానళ్లను ప్రారంభించింది. ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా నవంబర్ 20న ఈ చానళ్లను ప్రారంభించారు. కొవిడ్ 19 పాండమిక్ కారణంగా పిల్లలు ఇంటికే పరిమితమైన కారణంగా ఆన్‌లైన్ విద్య ఆవశ్యకత పెరిగింది. ఇలాంటి సమయంలో సీసమే స్ట్రీట్ మప్పెట్ షో ద్వారా విజ్ఞానాన్ని పంచడానికే తాము ఈ యూట్యూబ్ చానళ్లను ప్రారంభించినట్లు సీసమే వర్క్‌షాప్ ప్రకటించింది.

3 నుంచి 8 ఏళ్ల వయస్సున్న పిల్లలు తమ కుటుంబంతో కలిసి ఈ మప్పెట్ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన ఎల్మో, కుకీ మాన్‌స్టర్, ఆబీ, కడాబీ లాంటి పాత్రలు చేసే అల్లరిని ఇప్పుడు తమ భాషల్లో చూడవచ్చు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించే ఈ కార్యక్రమం పాశ్చాత్య దేశాల్లో చాలా పాపులర్ అని, ఎలాంటి ఖర్చు లేకుండా యూట్యూబ్ ద్వారా ఈ విజ్ఞానాన్ని భారతీయ భాషల్లో అందించడం ఆనందంగా ఉందని సీసమే వర్క్‌షాప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోనాలీ ఖాన్ తెలిపారు. పిల్లల్లో ఆసక్తిని, విద్యను, ఆరోగ్యం పట్ల శ్రద్ధను పెంచడమే కాకుండా ఎన్నో విషయాలను ఈ మప్పెట్ షో ద్వారా నేర్చుకోవచ్చని సోనాలీ ఖాన్ వెల్లడించారు.

Tags:    

Similar News