12 గంటలుగా కొనసాగుతున్న నాలుగు గ్రామాల ప్రజల ధర్నా

ఆదిలాబాద్ జిల్లాలోని దిల్వార్పూర్ మండలంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇతనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నేడు చేపట్టిన మహా ధర్నా 12 గంటలుగా కొనసాగుతూనే ఉంది.

Update: 2024-11-26 16:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలోని దిల్వార్పూర్ మండలంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇతనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నేడు చేపట్టిన మహా ధర్నా 12 గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఇతనాల్ ఫ్యాక్టరీకి తమ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని గత నాలుగు నెలల నుంచి దిలావర్పూర్ గ్రామంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ.. ప్రజలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దామని మంగళవారం బంద్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే దిలావర్పూర్ గుండంపల్లి ప్రజలు నిర్మల్ బైంసా జాతీయ రహదారిపైకి పెద్ద సంఖ్యలో చేరుకొని.. ఉదయం నుంచి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. కాగా దిలావర్పూర్ ప్రజలు చేస్తున్న ఈ పోరాటానికి స్థానిక గ్రామాల ప్రజల నుంచి ఊహించని విధంగా మద్దతు లభించింది. దీంతో వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

వందల సంఖ్యలో ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతుండటంతో.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. అయితే ఉదయం ప్రారంభం అయిన ఈ ధర్నా దాదాపు 12 కావొస్తున్న ఇంకా కొనసాగుతోంది. చీకటి పడటంతో రోడ్డుపై చలి మంటలు వేసుకుని మరి గ్రామాల ప్రజలు ఇతనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ధర్నాను కొనసాగిస్తున్నారు. అయితే చీకటి పడటం, గ్రామాస్తుల్లో ఓపిక సన్నగిల్లుతుండటంతో ఇతనాల్ ఫ్యాక్టరీ వైపు నిరసన కారులు వెళ్తే పరిస్థితులు చేజారిపోతాయనే భయంతో.. దాదాపు 500 మంది పోలీసులలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం దిల్వార్పూర్ మండలంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని.. ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే మధ్యాహ్నం.. నిరసన కారుల వద్దకు వచ్చిన ఆర్డీవోను స్థానిక గ్రామాల మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఆయన దాదాపు 4 గంటల పాటు కారులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Similar News