వరుస చోరీ కేసుల ఛేదన
దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో గతకొద్దిరోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలకు చెందిన కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. మంగళవారం ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ వి.రఘు మాట్లాడుతూ.. గత కొద్దికాలంగా ఆర్మూర్ పట్టణంలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించిన నిందితుడిని పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో అనుమానితుడుగా గుర్తించి పట్టుకున్నామన్నారు. విచారణలో భాగంగా నిందితుడు బోదాసు మహేష్( వడ్డెర) జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఇతనిపై ఇదివరకే ఏర్గట్ల మండలంలో […]
దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో గతకొద్దిరోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలకు చెందిన కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. మంగళవారం ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ వి.రఘు మాట్లాడుతూ.. గత కొద్దికాలంగా ఆర్మూర్ పట్టణంలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించిన నిందితుడిని పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో అనుమానితుడుగా గుర్తించి పట్టుకున్నామన్నారు.
విచారణలో భాగంగా నిందితుడు బోదాసు మహేష్( వడ్డెర) జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఇతనిపై ఇదివరకే ఏర్గట్ల మండలంలో చోరీ కేసు నమోదైందన్నారు. ఆర్మూర్ పట్టణంలో చోరీకి పాల్పడే ముందు ఏర్గట్ల గ్రామంలో ఒక మోటార్ సైకిల్ చోరీ చేసి దానిపైనే పగటిపూట తాళం వేసిన ఇండ్లను గమనించి.. రాత్రుళ్లు పట్టణంలోని యోగేశ్వర కాలనీ, రామ్ నగర్, విద్యా నగర్ కాలనీలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు.
దొంగిలించిన సొమ్మును అతని బావమరిది వద్ద దాచినట్లు తేలిందన్నారు. నిందితుడి నుంచి రూ. 5వేల ఒక మోటార్ సైకిల్ 12.2 గ్రాముల బంగారం రికవరీ చేశామని.. వీటి విలువ మొత్తం 6.5 లక్షలు ఉంటుందన్నారు.నిందితుడికి సహకరించిన మోర్తాడ్ మండలానికి చెందిన అతని బావమరిది ఇరగ దిండ్ల వీరేష్ ను సైతం కస్టడీలోకి తీసుకున్నామన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఆర్మూర్ సీఐ రాఘవేందర్, హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ రాములు, డీ రమేష్, కానిస్టేబుల్ గంగా ప్రసాద్, విజయ్ కుమార్, సీహెచ్ విజయ్ కుమార్‌లను అభినందించడమే కాకుండా.. కమిషనర్ చేతుల మీదుగా రివార్డులను అందిస్తామని ఏసీపీ తెలిపారు.