రియల్ మాడ్రిడ్ నుంచి సెర్జియో రామోస్ ఔట్
దిశ, స్పోర్ట్స్: రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో 16 ఏళ్ల అనుబంధానికి దిగ్గజ ఫుట్‌బాలర్ సెర్జియో రామోస్ వీడ్కోలు పలికాడు. 2005లో రియల్ మాడ్రిడ్‌తో జట్టు కట్టిన సెర్జియో ఇప్పటి వరకు 670 గేమ్స్ ఆడాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన 5 లా లిగా టైటిల్స్, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో సెర్జియో కీలకపాత్ర పోషించాడు. క్రిస్టియానో రొనాల్డో రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి వెళ్లి పోయిన తర్వాత ఆ జట్టుకు సెర్జియోనే కీలకంగా మారాడు. […]
దిశ, స్పోర్ట్స్: రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో 16 ఏళ్ల అనుబంధానికి దిగ్గజ ఫుట్‌బాలర్ సెర్జియో రామోస్ వీడ్కోలు పలికాడు. 2005లో రియల్ మాడ్రిడ్‌తో జట్టు కట్టిన సెర్జియో ఇప్పటి వరకు 670 గేమ్స్ ఆడాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన 5 లా లిగా టైటిల్స్, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో సెర్జియో కీలకపాత్ర పోషించాడు. క్రిస్టియానో రొనాల్డో రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి వెళ్లి పోయిన తర్వాత ఆ జట్టుకు సెర్జియోనే కీలకంగా మారాడు. ఈ విషయాన్ని రియల్ మాడ్రిడ్ క్లబ్ అధికారికంగా దృవీకరించింది. కాగా, సెర్జియో మాంచెస్టర్ యునైటెడ్, పారిస్ సెయింట్-జర్మేయన్ క్లబ్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 2014 చాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో కీలకమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మూడు ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్‌ను గెలిచిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.