వింబుల్డన్ నుంచి సెరేనా ఔట్

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ ఓపెన్ ఎరాలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన సెరేనా విలియమ్స్ గత కొన్ని సీజన్లుగా ఆ సంఖ్యను 24గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఓపెన్ ఎరాలో 24 గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలని సెరేనా ఎప్పటి నుంచో కలగంటున్నది. గత రెండేళ్లుగా సెరేనా ఖాతాలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. తాజాగా వింబుల్డన్‌లో ఏకంగా తొలి […]

Update: 2021-06-30 11:42 GMT

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ ఓపెన్ ఎరాలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన సెరేనా విలియమ్స్ గత కొన్ని సీజన్లుగా ఆ సంఖ్యను 24గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఓపెన్ ఎరాలో 24 గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలని సెరేనా ఎప్పటి నుంచో కలగంటున్నది. గత రెండేళ్లుగా సెరేనా ఖాతాలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. తాజాగా వింబుల్డన్‌లో ఏకంగా తొలి రౌండ్‌లతోనే తప్పుకున్నది. తొలి రౌండ్‌లో అలియక్ సాండ్రాతో ఆడుతుండగా సెరేనా కాలు బెణికింది. తీవ్రమైన నొప్పితోనే రెండు గేమ్స్ ఆడింది. కానీ ఆ తర్వాత ఆడలేక ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మెడికల్ టైమ్ అవుట్ తీసుకున్న తర్వాత కూడా సెరేనా కోలుకోలేక పోయింది. అభిమానుల సమక్షంలో భావోద్వేగంతో కోర్టును వీడింది. ఇక ఈ ఏడాది చివర్లో జరిగే యూఎస్ ఓపెన్‌లోనే సెరేనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉన్నది.

Tags:    

Similar News