47 వేల దిగువకు పతనమైన సెన్సెక్స్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు తప్పట్లేదు. మార్కెట్ నిపుణులు అంచనాలను నిజం చేస్తూ కేంద్ర బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడుతుండటంతో సూచీలు భారీగా కుప్పకూలుతున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ కీలక 47 వేల మార్కు దిగువకు సైతం పడిపోయింది. గురువారం ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయని, అనంతరం చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయని విశ్లేషకులు తెలిపారు. మరో మూడు రోజుల్లో కేంద్ర బడ్జెట్ రానుండటం, అంతర్జాతీయ మార్కెట్ల […]

Update: 2021-01-28 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు తప్పట్లేదు. మార్కెట్ నిపుణులు అంచనాలను నిజం చేస్తూ కేంద్ర బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడుతుండటంతో సూచీలు భారీగా కుప్పకూలుతున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ కీలక 47 వేల మార్కు దిగువకు సైతం పడిపోయింది. గురువారం ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయని, అనంతరం చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయని విశ్లేషకులు తెలిపారు. మరో మూడు రోజుల్లో కేంద్ర బడ్జెట్ రానుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు వరుసగా ఐదోరోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సూచీలు నెలరోజుల కనిష్ఠానికి పతనమయ్యాయని, సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 3 వేలకు పైగా పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 1,000 పాయింట్లను నష్టపోయినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 535.57 పాయింట్లు కోల్పోయి 46,874 వద్ద ముగియగా, నిఫ్టీ 149.95 పాయింట్లు నష్టపోయి 13,817 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యధికంగా 3.5 శాతం డీలాపడగా, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్టీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, టైటాన్ షేర్లు లాభపడగా, హిందూస్తాన్ యూనిలీవర్, మారుతీ సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.05 వద్ద ఉంది.

Tags:    

Similar News