తిరిగి లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాలను సాధించాయి. గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇచ్చిన 6 నెలల మారటోరియం పొడిగించడం కుదరదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు దూసుకెళ్లాయి. దీంతో స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి నష్టాలను అధిగమించాయి. ఉదయం ప్రారంభం నుంచే అంతర్జాతీయ మార్కెట్ల మద్ధతుతో సూచీలు సానుకూలంగా కదలాడాయి. అమెరికా మార్కెట్లు వారం గరిష్ఠాలతో ప్రారంభమవడం, బాండ్ ఈల్డ్స్ స్థిరంగా కొనసాగుతుండటంతో ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించాయని […]

Update: 2021-03-23 05:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాలను సాధించాయి. గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇచ్చిన 6 నెలల మారటోరియం పొడిగించడం కుదరదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు దూసుకెళ్లాయి. దీంతో స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి నష్టాలను అధిగమించాయి. ఉదయం ప్రారంభం నుంచే అంతర్జాతీయ మార్కెట్ల మద్ధతుతో సూచీలు సానుకూలంగా కదలాడాయి. అమెరికా మార్కెట్లు వారం గరిష్ఠాలతో ప్రారంభమవడం, బాండ్ ఈల్డ్స్ స్థిరంగా కొనసాగుతుండటంతో ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించాయని విశ్లేషకులు వెల్లడించారు. వీటికితోడు దేశీయ మార్కెట్లో కీలక రంగాల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టులో వాటా కొనుగోలుతో అదానీ గ్రూప్ సంస్థ షేర్లు అత్యధికంగా 10 శాతం లాభపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 280.15 పాయింట్లు లాభపడి 50,051 వద్ద ముగియగా, నిఫ్టీ 78.35 పాయింట్ల లాభంతో 14,814 వద్ద ముగిసింది.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ 3 శాతం లాభంతో ర్యాలీ చేయగా, ఫైనాన్స్, రియల్టీ రంగాలు పుంజుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.48 వద్ద ఉంది.

Tags:    

Similar News