ఆటుపోట్ల నుంచి లాభాల్లోకి మారిన సూచీలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు రోజంతా ఆటుపోట్లకు గురైనప్పటికీ చివరికి లాభాలను దక్కించుకున్నాయి. రెండురోజుల వరుస నష్టాలను అధిగమిస్తూ దేశీయ సూచీలు గురువారం చివరి గంటలో పుంజుకున్నాయి. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ రంగాలు మార్కెట్లకు మద్ధతునిచ్చాయి. దేశీయ దిగ్గజ కంపెనీల ర్యాలీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కనిపించడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉదయం ప్రారంభంలో నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరి గంట కొనుగోళ్లు పెరగడంతో రికార్డు స్థాయిలో […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు రోజంతా ఆటుపోట్లకు గురైనప్పటికీ చివరికి లాభాలను దక్కించుకున్నాయి. రెండురోజుల వరుస నష్టాలను అధిగమిస్తూ దేశీయ సూచీలు గురువారం చివరి గంటలో పుంజుకున్నాయి. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ రంగాలు మార్కెట్లకు మద్ధతునిచ్చాయి. దేశీయ దిగ్గజ కంపెనీల ర్యాలీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కనిపించడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉదయం ప్రారంభంలో నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరి గంట కొనుగోళ్లు పెరగడంతో రికార్డు స్థాయిలో మార్కెట్లు సాధించాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 222.13 పాయింట్లు ఎగసి 51,531 వద్ద ముగియగా, నిఫ్టీ 66.80 పాయింట్లు లాభపడి 15,173 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో, మీడియా, ఫైనాన్స్, రియల్టీ రంగాలు బలహీనపడగా, మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్‌లో రిలయన్స్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లె ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను దక్కించుకోగా, టైటాన్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.88 వద్ద ఉంది.