మార్కెట్ మళ్లీ డౌన్!

       కాస్త కోలుకుందని భావించిన మార్కెట్‌లు మళ్లీ డౌన్ అయ్యాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక 2019 డిసెంబర్ నెలలో 0.3 తగ్గిపోవడం, రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6 ఏళ్ల గరిష్టానికి చేరుకుని 7.59 శాతంగా నమోదైంది. దీంతో సూచీలన్నీ దిగజారాయి. బుధవారం అధిక లాభాలతో ముగిసిన మార్కెట్‌లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 147.16 పాయింట్లను నష్టపోయి 41,418 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 45.30 పాయింట్లు నష్టపోయి 12,219 వద్ద ట్రేడవుతోంది.   […]

Update: 2020-02-12 23:56 GMT

కాస్త కోలుకుందని భావించిన మార్కెట్‌లు మళ్లీ డౌన్ అయ్యాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక 2019 డిసెంబర్ నెలలో 0.3 తగ్గిపోవడం, రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6 ఏళ్ల గరిష్టానికి చేరుకుని 7.59 శాతంగా నమోదైంది. దీంతో సూచీలన్నీ దిగజారాయి. బుధవారం అధిక లాభాలతో ముగిసిన మార్కెట్‌లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 147.16 పాయింట్లను నష్టపోయి 41,418 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 45.30 పాయింట్లు నష్టపోయి 12,219 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ ఫలితాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్‌బీఐ, టైటాన్ సూచీలు అధిక లాభాలతో కొనసాగుతుంటే, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ సూచీలూ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News