భారీ లాభాలకు బ్రేక్.. డీలాపడ్డ సూచీలు !

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస భారీ లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ అనుకూల పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో రెండు రోజులు భారీ లాభాలు సాధించిన సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరి వరకు ప్రతికూల ధోరణిలోనే కదలాడాయి. మిడ్-సెషన్‌కు ముందు లాభాల్లో కదలాడినప్పటికీ అనంతరం బ్యాంక్, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు డీలాపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా […]

Update: 2021-05-19 05:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస భారీ లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ అనుకూల పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో రెండు రోజులు భారీ లాభాలు సాధించిన సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరి వరకు ప్రతికూల ధోరణిలోనే కదలాడాయి. మిడ్-సెషన్‌కు ముందు లాభాల్లో కదలాడినప్పటికీ అనంతరం బ్యాంక్, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు డీలాపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా ప్రతికూల సంకేతాలు రావడం, దేశీయంగా కీలక రంగాల షేర్లు నష్టపోవడంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని, దీనికితోడు గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ మార్కెట్ల నష్టాలకు కారణమని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 290.69 పాయింట్లు కోల్పోయి 49,902 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 77.95 పాయింట్లు నష్టపోయి 15,030 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా 1 శాతం పుంజుకోగా, మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా రంగాలలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకోగా, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, ఆల్ట్రా సిమెంట్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.14 వద్ద ఉంది.

Tags:    

Similar News