వారాంతం నష్టాల్లో సూచీలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికార్డు లాభాలకు వారాంతం బ్రేక్ పడింది. గురువారం నాటి ట్రేడింగ్ తర్వాత మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం ఉదయం ప్రారంభంలో లాభాలతోనే మొదలైన సూచీలు అనంతరం నష్టాల బాట పట్టాయి. దేశీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ మిడ్-సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. మొదటి 59,737 పాయింట్ల జీవితకాల గరిష్ఠాల వద్ద ట్రేడయిన తర్వాత పెట్టుబడిదారులు లాభాలను తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో మార్కెట్లు ముగిసే […]

Update: 2021-09-17 07:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికార్డు లాభాలకు వారాంతం బ్రేక్ పడింది. గురువారం నాటి ట్రేడింగ్ తర్వాత మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం ఉదయం ప్రారంభంలో లాభాలతోనే మొదలైన సూచీలు అనంతరం నష్టాల బాట పట్టాయి. దేశీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ మిడ్-సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. మొదటి 59,737 పాయింట్ల జీవితకాల గరిష్ఠాల వద్ద ట్రేడయిన తర్వాత పెట్టుబడిదారులు లాభాలను తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 125.27 పాయింట్లను కోల్పోయి 59.015 వద్ద క్లోజయింది. నిఫ్టీ 44.35 పాయింట్లు నష్టపోయి 17,585 వద్ద ముగిసింది.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ రంగాలు పతనమయ్యాయి. ఇక, బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టాటా స్టీల్, ఎస్‌బీఐ, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, రిలయన్స్, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.51 వద్ద ఉంది. ఇదే సమయంలో కేంద్రం తీసుకున్న సంస్కరణలతో గురువారం టెలికాం షేర్లు భారీగా దూసుకెళ్లాయి. శుక్రవారం సైతం టెలికాం షేర్లు అదే జోరును కొనసాగించాయి. ఎయిర్‌టెల్ షేర్ ధర 1.39 శాతం పెరిగింది.

Tags:    

Similar News