భారీగా కుదేలైన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లు ఊహించని స్థాయిలో భారీగా పతనమయ్యాయి. చైనా దాటి బయటి దేశాల్లో ఎక్కువ కరోనావైరస్ మరణాలు నమొదవుతుండటంతో సూచీలు భారీగా పడిపోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 806.69 పాయింట్ల నష్టంతో 40,363 వద్ద ముగిసింది. నిఫ్టీ 242.25 పాయింట్లను కోల్పోయి 11,838 వద్ద క్లోజయింది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు క్షీణించి రూ. 71.89 వద్ద ఉంది. ప్రధానంగా మెటల్ రంగం […]

Update: 2020-02-24 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లు ఊహించని స్థాయిలో భారీగా పతనమయ్యాయి. చైనా దాటి బయటి దేశాల్లో ఎక్కువ కరోనావైరస్ మరణాలు నమొదవుతుండటంతో సూచీలు భారీగా పడిపోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 806.69 పాయింట్ల నష్టంతో 40,363 వద్ద ముగిసింది. నిఫ్టీ 242.25 పాయింట్లను కోల్పోయి 11,838 వద్ద క్లోజయింది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు క్షీణించి రూ. 71.89 వద్ద ఉంది.

ప్రధానంగా మెటల్ రంగం షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. సుమారు 4 శాతం వరకు మెటల్ రంగం షేర్లు పడిపోయాయి. మరో రంగం ఆటో సైతం భారీగా నష్టాలను చూసింది. దాదాపు రెండున్నర శాతం ఆటో రంగం క్షీణించింది. సెన్సెక్స్‌లో ఇండెక్స్‌లోని 30 స్టాక్స్ నష్టాలతోనే ముగిశాయి. టాటాస్టీల్, ఓఎన్‌జీసీ, మారుతీ సుజుకీ షేర్లు భారీగా 4 శాతం వరకు నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.

Read also..

కరోనా దెబ్బకు పడిపోయిన రంగాలు!

Full View

Tags:    

Similar News