నష్టాల్లో ముగిసిన సూచీలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సూచీలు మంగళవారం సాధించిన లాభాల నుంచి వెనక్కి తగ్గి స్వల్పంగా నష్టపోయాయి. ఉదయం ప్రారంభంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు గంట తర్వాత నుంచి నష్టాలను కొనసాగించాయి. చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ సంక్షోభం నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో దేశీయ మార్కెట్లలో మదుపర్లు ప్రతికూల సంకేతాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆటో, హెల్త్‌కేర్, మెటల్, టెక్నాలజీ […]

Update: 2021-09-22 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సూచీలు మంగళవారం సాధించిన లాభాల నుంచి వెనక్కి తగ్గి స్వల్పంగా నష్టపోయాయి. ఉదయం ప్రారంభంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు గంట తర్వాత నుంచి నష్టాలను కొనసాగించాయి. చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ సంక్షోభం నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో దేశీయ మార్కెట్లలో మదుపర్లు ప్రతికూల సంకేతాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆటో, హెల్త్‌కేర్, మెటల్, టెక్నాలజీ మెరుగైన కొనుగోళ్లతో మద్దతివ్వగా, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 77.94 పాయింట్లను కోల్పోయి 58,927 వద్ద క్లోజయింది. నిఫ్టీ 15.35 పాయింట్ల నష్టంతో 17.546 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, ఆటో రంగాలు నీరసించాయి. అయితే, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు గతవారం కంటే బలంగా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, రిలయన్స్, టాటాస్టీల్ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.88 వద్ద ఉంది.

Tags:    

Similar News