వరుసగా మూడోరోజూ నష్టపోయిన సూచీలు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి వరుసగా మూడోరోజు అధిక నష్టాలను నమోదు చేశాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత నుంచి లాభనష్టాల మధ్య కదలాడిన సూచీలకు సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడటం కలిసి రాలేదు. ఈ క్రమంలో మిడ్-సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు ఊగిసలాట నుంచి అధిక నష్టాలవైపు పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 286.91 పాయింట్లను కోల్పోయి 59,126 […]

Update: 2021-09-30 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి వరుసగా మూడోరోజు అధిక నష్టాలను నమోదు చేశాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత నుంచి లాభనష్టాల మధ్య కదలాడిన సూచీలకు సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడటం కలిసి రాలేదు. ఈ క్రమంలో మిడ్-సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు ఊగిసలాట నుంచి అధిక నష్టాలవైపు పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 286.91 పాయింట్లను కోల్పోయి 59,126 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 93.15 పాయింట్లు పతనమై 17,618 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్, మెటల్, ఐటీ, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, ఆటో, ఫైనాన్స్ రంగాలు నీరసించాయి. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా, కన్స్యూమార్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాలను దక్కించుకోగా, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 74.28 వద్ద ఉంది.

Tags:    

Similar News