వరుసగా రెండో రోజు కుదేలైన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం ఉదయం ప్రారంభ సమయంలో లాభాల్లో ర్యాలీ చేసినప్పటికీ మిడ్-సెషన్ అనంతరం సూచీలు నష్టాల్లో మారాయి. ముఖ్యంగా కొవిడ్‌ను నియంత్రించేందుకు కేంద్ర టీకా పంపిణీ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం కనబడింది. అయితే, మిడ్-సెషన్ తర్వాత హెవీ వెయిట్ షేర్ల అమ్మకాలతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను […]

Update: 2021-04-20 06:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం ఉదయం ప్రారంభ సమయంలో లాభాల్లో ర్యాలీ చేసినప్పటికీ మిడ్-సెషన్ అనంతరం సూచీలు నష్టాల్లో మారాయి. ముఖ్యంగా కొవిడ్‌ను నియంత్రించేందుకు కేంద్ర టీకా పంపిణీ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం కనబడింది. అయితే, మిడ్-సెషన్ తర్వాత హెవీ వెయిట్ షేర్ల అమ్మకాలతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 243.62 పాయింట్లు కోల్పోయి 47,705 వద్ద ముగియగా, నిఫ్టీ 63.05 పాయింట్ల నష్టంతో 14,296 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 1.4 శాతం పడిపోగా, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. ఫార్మా, ఆటో, మెటల్, రియల్టీ, మీడియా రంగాల సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, డా రెడ్డీస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి, ఎల్అండ్‌టీ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌సీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.01 వద్ద ఉంది.

Tags:    

Similar News