మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారాంతం కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ వారం మొత్తం ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు వారాంతాన్ని అధిక నష్టాలతోనే ముగించాయి. యాధృచ్ఛికంగా గతవారంలాగే ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లు చివరి రెండు సెషన్లను నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ పరిణామాలే శుక్రవారం నష్టాలకు దారితీశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధిమైన నేపథ్యంలోనే సూచీలు డీలాపడ్డాయని నిపుణులు తెలిపారు. దీంతో […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారాంతం కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ వారం మొత్తం ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు వారాంతాన్ని అధిక నష్టాలతోనే ముగించాయి. యాధృచ్ఛికంగా గతవారంలాగే ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లు చివరి రెండు సెషన్లను నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ పరిణామాలే శుక్రవారం నష్టాలకు దారితీశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధిమైన నేపథ్యంలోనే సూచీలు డీలాపడ్డాయని నిపుణులు తెలిపారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 440.76 పాయింట్లు కోల్పోయి 50,405 వద్ద ముగిసింది. నిఫ్టీ 142.65 పాయింట్లు నష్టపోయి 14,938 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ అధికంగా 3.5 శాతం పతమైంది. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాల్లు ఒక్కో శాతం డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, మారుతీ సుజుకి, కోటక్ బ్యాంక్, నెస్లె ఇండియా షేర్లు లాభాలను దక్కించుకోగా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, డా రెడ్డీస్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.06 వద్ద ఉంది.