ఒడిదుడుకుల మధ్య డీలాపడ్డ మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మెటల్ షేర్లు మెరుగ్గా ర్యాలీ చేసినప్పటికీ ఐటీ రంగం షేర్లు దిద్దుబాటు చర్యలకు దిగడంతో సూచీలు నీరసించాయి. సోమవారం నాటి భారీ లాభాల తర్వాత మంగళవారం అదే స్థాయిలో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అనంతరం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. మిడ్ సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో స్వల్ప నష్టాలు తప్పలేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 49.96 పాయింట్లు నష్టపోయి […]

Update: 2021-02-16 05:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మెటల్ షేర్లు మెరుగ్గా ర్యాలీ చేసినప్పటికీ ఐటీ రంగం షేర్లు దిద్దుబాటు చర్యలకు దిగడంతో సూచీలు నీరసించాయి. సోమవారం నాటి భారీ లాభాల తర్వాత మంగళవారం అదే స్థాయిలో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అనంతరం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. మిడ్ సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో స్వల్ప నష్టాలు తప్పలేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 49.96 పాయింట్లు నష్టపోయి 52,104 వద్ద ముగియగా, నిఫ్టీ స్వల్పంగా 1.25 పాయింట్లను కోల్పోయి 15,313 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఐటీ రంగం 1.5 శాతం మేర పతనమవగా, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాలు డీలాపడ్డాయి. మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ షేర్లు 5 శాతానికి పైగా ర్యాలీ చేయగా, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, రిలయన్స్, మారుతీ సుజుకి షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లె ఇండియా, ఎస్‌బీఐ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.59 వద్ద ఉంది. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, అంతర్జాతీయంగా డాలర్ నీరసించడంతో రూపాయి మారకం విలువ మంగళవారం 9 పైసలు బలపడింది.

Tags:    

Similar News