స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఉదయం ప్రారంభంలో నష్టాలను చూసినప్పటికీ అనంతరం అటుపోట్ల మధ్య కొనసాగాయి. మిడ్-సెషన్ తర్వాత మళ్లీ నష్టాల్లోకి చేరిన సూచీలు చివరికి ఊగిసలాటతో తక్కువ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ దేశీయంగా కరోనా కేసులు పెరుగుదల, లాక్‌డౌన్ పరిణామాలతో మదుపర్లను కరోనా భయం వీడలేదు. రోజంగా లాభాల స్వీకరణ మధ్య కొనసాగిన తర్వాత ఆసియా మార్కెట్ల మద్దతుతో […]

Update: 2021-04-06 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఉదయం ప్రారంభంలో నష్టాలను చూసినప్పటికీ అనంతరం అటుపోట్ల మధ్య కొనసాగాయి. మిడ్-సెషన్ తర్వాత మళ్లీ నష్టాల్లోకి చేరిన సూచీలు చివరికి ఊగిసలాటతో తక్కువ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ దేశీయంగా కరోనా కేసులు పెరుగుదల, లాక్‌డౌన్ పరిణామాలతో మదుపర్లను కరోనా భయం వీడలేదు. రోజంగా లాభాల స్వీకరణ మధ్య కొనసాగిన తర్వాత ఆసియా మార్కెట్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటపడ్డాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 42.07 పాయింట్ల లాభంతో 49,201 వద్ద ముగియగా, నిఫ్టీ 45.70 పాయింట్లు లాభపడి 14,683 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా, మెటల్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగాలు బలపడగా, బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, మీడియా రంగాలు నీరసించాయి. నిఫ్టీ 50లో అదానీ పోర్ట్స్ షేర్ ధర ఇంట్రాడేలో 14 శాతం వరకూ లాభపడిన తర్వాత చివరకు రూ.93.30 పెరిగి 12.57 శాతం లాభంతో రూ.836 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్, డా రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా షేర్లు లాభాలను సాధించగా, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.45 వద్ద ఉంది.

Tags:    

Similar News