నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. సోమవారం సానుకూలంగా మొదలైన సూచీలు అనంతరం ఇంట్రాడే గరిష్ఠాల నుంచి నష్టాలకు జారాయి. కీలక కంపెనీల షేర్లు కృంగడం, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూలత నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దిగజారాయని విశ్లేషకులు తెలిపారు. ఆసియా ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కోవడంతో మార్కెట్లు నీరసించాయి. దీంతో మార్కెట్లు […]

Update: 2021-06-28 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. సోమవారం సానుకూలంగా మొదలైన సూచీలు అనంతరం ఇంట్రాడే గరిష్ఠాల నుంచి నష్టాలకు జారాయి. కీలక కంపెనీల షేర్లు కృంగడం, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూలత నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దిగజారాయని విశ్లేషకులు తెలిపారు. ఆసియా ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కోవడంతో మార్కెట్లు నీరసించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 189.45 పాయింట్లు కోల్పోయి 52,735 వద్ద ముగియగా, నిఫ్టీ 45.65 పాయింట్ల నష్టంతో 15,814 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ అధికంగా బలహీనపడగా, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో, మీడియా, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు నీరసించాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ మెటల్ రంగాలు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా రెడ్డీస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభపడగా, టైటాన్, టీసీఎస్, హెచ్‌సీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, అల్ట్రా సిమెంట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.20 వద్ద ముగిసింది.

Tags:    

Similar News