60 వేల దిగువకు పతనమైన సెన్సెక్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల బాట పడుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ప్రధానంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనల మధ్య లాభాల స్వీకరణకు సిద్ధపడ్డారు. ద్రవ్యోల్బణ భయాల కారణంగా ఆసియా మార్కెట్లు ఒత్తిడి ఎదుర్కోవడంతో డాలర్ మారకం 16 నెలల గరిష్ఠాలకు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. ప్రధానంగా అమెరికాలో ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం సంకేతాల మధ్య విదేశీ మదుపర్లు లాభాలను తీసుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ పరిణామాల ప్రభావం అధికం […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల బాట పడుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ప్రధానంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనల మధ్య లాభాల స్వీకరణకు సిద్ధపడ్డారు. ద్రవ్యోల్బణ భయాల కారణంగా ఆసియా మార్కెట్లు ఒత్తిడి ఎదుర్కోవడంతో డాలర్ మారకం 16 నెలల గరిష్ఠాలకు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. ప్రధానంగా అమెరికాలో ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం సంకేతాల మధ్య విదేశీ మదుపర్లు లాభాలను తీసుకునేందుకు సిద్ధపడ్డారు.
ఈ పరిణామాల ప్రభావం అధికం కావడంతో బీఎస్ఈ సెన్సెక్స్ మరోసారి 60,000 దిగువకు పతనమైంది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. గురువారం పతనంలో ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, రియల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు నిపుణులు వెల్లడించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 433.13 పాయింట్లు కుదేలై 59,919 వద్ద, నిఫ్టీ 143.60 పాయింట్లు కోల్పోయి 17,873 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ అత్యధికంగా 2 శాతం దెబ్బతినగా, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్, ఆటో, ఫైనాన్స్ రంగాలు 1-2 శాతం మధ్య నీరసించాయి.
మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, ఎంఅండ్ఎం, రిలయన్స్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగ్లిన అన్ని షేర్లు నష్టాల్లో ర్యాలీ చేశాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.49 వద్ద ఉంది.