సూచీలన్నీ లాభాల్లోనే…మార్కెట్ల దూకుడు!
గత వారాంతం నుంచి నష్టాలను ఎదుర్కొంటున్న మార్కెట్లు మంగళవారం ఊరటనిచ్చాయి. కరోనా భయంతో వెనుకా ముందు అంటూ సాగిన సూచీలు ఎట్టకేలకు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 408.33 పాయింట్లు లాభపడి 41,387 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 125.45 పాయింట్ల లాభంతో 12,156 వద్ద ట్రేడవుతోంది. కీలకమైన కంపెనీల సూచీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి అధిక నష్టాలను పూడ్చుకుంటూ టాటా స్టీల్ ఈరోజు అధిక లాభంతో దూసుకెళ్తోంది. ప్రధానంగా బ్యాంకింగ్ రంగం […]
గత వారాంతం నుంచి నష్టాలను ఎదుర్కొంటున్న మార్కెట్లు మంగళవారం ఊరటనిచ్చాయి. కరోనా భయంతో వెనుకా ముందు అంటూ సాగిన సూచీలు ఎట్టకేలకు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 408.33 పాయింట్లు లాభపడి 41,387 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 125.45 పాయింట్ల లాభంతో 12,156 వద్ద ట్రేడవుతోంది. కీలకమైన కంపెనీల సూచీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి అధిక నష్టాలను పూడ్చుకుంటూ టాటా స్టీల్ ఈరోజు అధిక లాభంతో దూసుకెళ్తోంది. ప్రధానంగా బ్యాంకింగ్ రంగం మార్కెట్‌ను లాభాల్లోకి తీసుకెళ్తోంది. టాటాస్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ అధిక లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
కరోనా వైరస్ మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో ప్రధాన కర్మాగారాలన్నీ మూతపడటంతో రానున్న రోజుల్లో ప్రభావం మరింతగా పెరగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.