ఊగిసలాడి…నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
అంతర్జాతీయంగా భయపెడుతున్న కోవిడ్-19 దెబ్బకు దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాటలో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత పూర్తీగా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. మార్కెట్ క్లోజయ్యే సమయానికి సెన్సెక్స్ 202.05 పాయింట్లు నష్టపోయి 41,055 వద్ద ముగిసింది. నిఫ్టీ 67.65 పాయింట్లు కోల్పోయి 12,045 వద్ద క్లోజయింది. సెన్సెక్స్‌లో టైటాన్, నెస్లె, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉండగా, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ […]
అంతర్జాతీయంగా భయపెడుతున్న కోవిడ్-19 దెబ్బకు దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాటలో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత పూర్తీగా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. మార్కెట్ క్లోజయ్యే సమయానికి సెన్సెక్స్ 202.05 పాయింట్లు నష్టపోయి 41,055 వద్ద ముగిసింది. నిఫ్టీ 67.65 పాయింట్లు కోల్పోయి 12,045 వద్ద క్లోజయింది. సెన్సెక్స్‌లో టైటాన్, నెస్లె, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉండగా, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలహీనపడి రూ. 71.39 వద్ద ఉంది. ప్రధానంగా ఇంధన, మెటల్ సూచీలు దిగజారడం, కరోనా భయాలు మార్కెట్లు నష్టపోవడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.