భారీ లాభాలతో దూసుకెళ్లిన మార్కెట్లు!

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవడంతో మార్కెట్లలో సెంటిమెంట్‌ బలపడింది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు వైపు ఆసక్తి చూపించడంతో మెటల్, ఐటీ‌ షేర్లు కూడా లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు, దేశీయ మార్కెట్లలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు దూసుకెళ్లడంతో సూచీలు పరుగులుపెట్టాయి. పైగా, గురువారంతో మే నెల డెరివేటివ్ ముగియనుండటం కూడా మార్కెట్ల జోరుకు కారణమయ్యాయి. మార్కెట్లు పుంజుకోవడంతో సెన్సెక్స్ 995.92 పాయింట్ల భారీ […]

Update: 2020-05-27 07:23 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవడంతో మార్కెట్లలో సెంటిమెంట్‌ బలపడింది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు వైపు ఆసక్తి చూపించడంతో మెటల్, ఐటీ‌ షేర్లు కూడా లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు, దేశీయ మార్కెట్లలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు దూసుకెళ్లడంతో సూచీలు పరుగులుపెట్టాయి. పైగా, గురువారంతో మే నెల డెరివేటివ్ ముగియనుండటం కూడా మార్కెట్ల జోరుకు కారణమయ్యాయి. మార్కెట్లు పుంజుకోవడంతో సెన్సెక్స్ 995.92 పాయింట్ల భారీ లాభంతో 31,605 వద్ద ముగియగా, నిఫ్టీ 285.90 పాయింట్లు లాభపడి 9,314 వద్ద ముగిసింది. బుధవారం బలహీనంగా మొదలైనప్పటికీ లంచ్ టైం తర్వాత మార్కెట్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు లాభాలతో స్పీడు పెంచాయి. దీనివల్లే మార్కెట్లకు బలం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. రానున్న మరో రెండు రోజుల వరకూ మార్కెట్లలో ఇదే జోరు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ 13.46 శాతం లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్ 8.97 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 5.91 శాతం, ఇణ్డస్ఇండ్ 5.84 లాభాలను చూశాయి. బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా, ఎస్‌బీఐ సూచీలు లాభాలను చూడగా, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

Tags:    

Similar News