ఈక్విటీ మార్కెట్లో రికార్డుల మోత..

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డుల మోత మోగించాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు జీవితకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే సానుకూలంగా మొదలైన స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా దాదాపు అన్ని రంగాలు గణనీయమైన లాభాలతో రాణించాయి. బీఎస్ఈ సెన్సెస్క్ ఓ దశలో 57 వేల కీలక మైలురాయికి చేరువకు వెళ్లినప్పటికీ తర్వాత కొంత […]

Update: 2021-08-30 09:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డుల మోత మోగించాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు జీవితకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే సానుకూలంగా మొదలైన స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా దాదాపు అన్ని రంగాలు గణనీయమైన లాభాలతో రాణించాయి. బీఎస్ఈ సెన్సెస్క్ ఓ దశలో 57 వేల కీలక మైలురాయికి చేరువకు వెళ్లినప్పటికీ తర్వాత కొంత వెనక్కి తగ్గింది. నిఫ్టీ సైతం 17 వేల మైలురాయికి దగ్గరలో ఉంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 765.04 పాయింట్లు ఎగసి 56,889 వద్ద క్లోజయింది.

నిఫ్టీ 225.85 పాయింట్లు పెరిగి 16,931 వద్ద ముగిసింది. నిఫ్టీలో టెలికాం ఇండెక్స్ అత్యధికంగా 3.5 శాతానికి పైగా బలపడగా, మిగిలిన అన్ని రంగాలు పుంజుకున్నాయి. ఐటీ రంగం మాత్రమే నీరసించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఆటో, మెటల్ సహా అన్ని రంగాలు 1.5 నుంచి 2.5 శాతం మధ్య పెరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 4 శాతానికి పైగా దూసుకెళ్లాయి. టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకి, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.29 వద్ద ఉంది.

Tags:    

Similar News