37 వేల మార్కు దాటిన సెన్సెక్స్

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధమవడంతో మార్కెట్లకు లాభాలొచ్చాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం నుంచే లాభాల జోరు చూపించిన సూచీలు చివరి గంటలో మరింత స్పీడ్‌తో ముగించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 548.46 పాయింట్లు లాభపడి 37,020 వద్ద ముగియగా, నిఫ్టీ 161.75 పాయింట్ల లాభంతో 10,901 వద్ద ముగిసింది. వరుసగా రెండో రోజు సానుకూలంగా మొదలైన‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌ […]

Update: 2020-07-17 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధమవడంతో మార్కెట్లకు లాభాలొచ్చాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం నుంచే లాభాల జోరు చూపించిన సూచీలు చివరి గంటలో మరింత స్పీడ్‌తో ముగించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 548.46 పాయింట్లు లాభపడి 37,020 వద్ద ముగియగా, నిఫ్టీ 161.75 పాయింట్ల లాభంతో 10,901 వద్ద ముగిసింది. వరుసగా రెండో రోజు సానుకూలంగా మొదలైన‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌ తర్వాత పెట్టుబడిదారులు కొనుగోళ్ల జోరు చూపించడంతో 36,548 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ వారాంతంలో 37 వేల మార్కును దాటింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, నెస్లె ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేయగా, మిగిలిన సూచీలన్నీ లాభాల్లో ట్రేడయ్యాయి. ఓఎన్‌జీసీ, టైటాన్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అత్యధికంగా 3 శాతంపైగా లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీలో బ్యాంక్‌ నిఫ్టీ, మెటల్‌, ఆటో రంగాలు 1 శాతానికిపైగా లాభాల్లో ట్రేడయ్యాయి.

Tags:    

Similar News