డీలా పడిన మార్కెట్లు
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, రెండోసారి కరోనా విజృంభిస్తుందనే ఆందోళనలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవ్వడం, భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మైనస్ 5 శాతం ఉండవచ్చునని ఎస్అండ్‌పీ హెచ్చరించిన పరిణామాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల అమ్మకాల ధోరణితో దేశీయ మార్కెట్లలోను ఇన్వెస్టర్లు ఆందోళన పడ్డారు. దీంతో ఉదయం […]
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, రెండోసారి కరోనా విజృంభిస్తుందనే ఆందోళనలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవ్వడం, భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మైనస్ 5 శాతం ఉండవచ్చునని ఎస్అండ్‌పీ హెచ్చరించిన పరిణామాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల అమ్మకాల ధోరణితో దేశీయ మార్కెట్లలోను ఇన్వెస్టర్లు ఆందోళన పడ్డారు. దీంతో ఉదయం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో రోజంతా సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 209.75 పాయింట్లు నష్టపోయి 34,961 వద్ద ముగియగా, నిఫ్టీ 70.60 పాయింట్లను కోల్పోయి 10,312 వద్ద ముగిసింది. రెండోదశ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదనే అంచనాలు మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్తాన్ యూనిలివర్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలను నమోదు చేయగా, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.