మళ్లీ నష్టాలను నమోదు చేసిన మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం మళ్లీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా టెక్ దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సహకరంగా ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కొనసాగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 129.18 పాయింట్లు నష్టపోయి 37,606 వద్ద ముగియగా, నిఫ్టీ 28.70 పాయింట్లు కోల్పోయి 11,073 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా […]

Update: 2020-07-31 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం మళ్లీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా టెక్ దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సహకరంగా ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కొనసాగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 129.18 పాయింట్లు నష్టపోయి 37,606 వద్ద ముగియగా, నిఫ్టీ 28.70 పాయింట్లు కోల్పోయి 11,073 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లు అధికంగా 3.5 శాతానికి మించి ర్యాలీ చేయగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు బలపడగా, మీడియా, ప్రైవేట్ రంగ బ్యాంక్ సూచీలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్ సూచీలు లాభాల్లో ట్రేడవ్వగా, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Tags:    

Similar News