వరుసగా మూడోరోజు మార్కెట్ల దూకుడు!

దిశ, సెంట్రల్ డెస్క్ : దేశీయ మార్కెట్లు రోజంతా స్వల్ప ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, చివర్లో పుంజుకుని వరుసగా మూడోరోజు లాభాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో మొదలైనా చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు కారణంగా 200 పాయింట్లకు పైగా లాభపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 223.51 పాయింట్ల లాభంతో 32,424 వద్ద ముగియగా, నిఫ్టీ 90.20 పాయింట్లు లాభపడి 9,580 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే, ముఖ్యంగా ఫార్మా, మెటల్‌, రియల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, […]

Update: 2020-05-29 05:57 GMT

దిశ, సెంట్రల్ డెస్క్ :
దేశీయ మార్కెట్లు రోజంతా స్వల్ప ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, చివర్లో పుంజుకుని వరుసగా మూడోరోజు లాభాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో మొదలైనా చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు కారణంగా 200 పాయింట్లకు పైగా లాభపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 223.51 పాయింట్ల లాభంతో 32,424 వద్ద ముగియగా, నిఫ్టీ 90.20 పాయింట్లు లాభపడి 9,580 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే, ముఖ్యంగా ఫార్మా, మెటల్‌, రియల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగాలు లాభపడగా, ఐటీ రంగం మాత్రమే నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, ఐటీసీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా సూచీలు లాభపడగా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 75.62 వద్ద ఉంది. గురువారం నష్టాలతో పోలిస్తే శుక్రవారం రూపాయి 14 పైసలు ఎగిసింది. విదేశీ నిధుల ప్రవాహానికి తోడు, అమెరికా డాలరు బలహీనత కారణంగా రూపాయి బలపడింది.ఈ పరిణామాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News