నష్టాలతో క్లోజయిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన సమావేశంలో జరిగిన ఒప్పందాలు మార్కెట్ సెంటిమెంట్ పెంచడంలో విఫలమయ్యాయి. వైరస్ ప్రభావంతో అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం వల్ల ఆర్థిక వృద్ధి దెబ్బ తింటుందనే ఆందోళన కారణంగా మంగళవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. చైనా దాటి ఇతర దేశాల్లో కరోనా వైరస్ మరణాలు పెరగడంతో మార్కెట్లకు నష్టాలు తప్పట్లేదు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 82.03 పాయింట్ల నష్టంతో 40,281 వద్ద […]

Update: 2020-02-25 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన సమావేశంలో జరిగిన ఒప్పందాలు మార్కెట్ సెంటిమెంట్ పెంచడంలో విఫలమయ్యాయి. వైరస్ ప్రభావంతో అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం వల్ల ఆర్థిక వృద్ధి దెబ్బ తింటుందనే ఆందోళన కారణంగా మంగళవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. చైనా దాటి ఇతర దేశాల్లో కరోనా వైరస్ మరణాలు పెరగడంతో మార్కెట్లకు నష్టాలు తప్పట్లేదు.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 82.03 పాయింట్ల నష్టంతో 40,281 వద్ద ముగిసింది. నిఫ్టీ 16.20 పాయింట్లను కోల్పోయి 11,813 వద్ద క్లోజయింది. టీసీఎస్ 1.98 శాతంతో స్టాక్స్‌లో అధిక లాభాలను చూసింది. టాటాస్టీల్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో క్లోజవ్వగా, సన్‌ఫార్మా అత్యధికంగా 2.37 శాతం క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 71.85 వద్ద ఉంది.

Tags:    

Similar News