కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి
న్యూఢిల్లీ : కరోనా ధాటికి సామాన్య ప్రజలే కాదు.. రాజకీయ ప్రముఖులూ బలౌతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి డాక్టర్ ఎ.కె. వాలియా కరోనా బారిన పడి మరణించారు. గురువారం ఉదయం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన ఆయన వయస్సు 72 సంవత్సరాలు. ఢిల్లీ రాష్ట్ర హోదా పొందినప్పటి నుంచి ఆయన వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ క్యాబినెట్ లో పలు మంత్రిత్వ శాఖలకు […]
న్యూఢిల్లీ : కరోనా ధాటికి సామాన్య ప్రజలే కాదు.. రాజకీయ ప్రముఖులూ బలౌతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి డాక్టర్ ఎ.కె. వాలియా కరోనా బారిన పడి మరణించారు. గురువారం ఉదయం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన ఆయన వయస్సు 72 సంవత్సరాలు. ఢిల్లీ రాష్ట్ర హోదా పొందినప్పటి నుంచి ఆయన వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ క్యాబినెట్ లో పలు మంత్రిత్వ శాఖలకు మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఢిల్లీలో జన్మించిన వాలియా వృత్తిరీత్యా వైద్యుడు.