అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

దిశ, పరకాల : డీసీఎం వాహనం ద్వారా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పరకాల పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. డీసీఎం వాహనం ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందగా బుధవారం తెల్లవారు జామున పరకాల ఇన్‌ స్పెక్టర్ మహేందర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ తుమ్మల ప్రశాంత్ బాబు తమ సిబ్బందితో కలిసి రెండు టీములుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అంబేద్కర్ సెంటర్ నుంచి […]

Update: 2021-09-22 11:00 GMT

దిశ, పరకాల : డీసీఎం వాహనం ద్వారా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పరకాల పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. డీసీఎం వాహనం ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందగా బుధవారం తెల్లవారు జామున పరకాల ఇన్‌ స్పెక్టర్ మహేందర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ తుమ్మల ప్రశాంత్ బాబు తమ సిబ్బందితో కలిసి రెండు టీములుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఓ వాహనం అతి వేగంగా వెళుతుండగా గమనించిన పోలీసులు వెంబడించి పట్టుకోవడం జరిగింది. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 2.47 లక్షల విలువ గల 165 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం విజ్జయపల్లికి చెందిన డీసీఎం డ్రైవర్ గుండెబోయిన ఓంకార్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇట్టి బియ్యాన్ని ఎల్కతుర్తి ప్రాంతం నుంచి లోడ్ చేసుకుని మహారాష్ట్రలోని సిరంచకు తరలిస్తున్నట్లు నిందితుడి ద్వారా తెలుస్తోందని ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ అక్రమ దందాలో భాగస్వామ్యం కలిగిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం చెందిన కళ్లెపు భవాని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలానికి చెందిన తూర్పాటి శంకర్ పరారీలో ఉన్నారని, డీసీఎంను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News