రోహిత్ లేకపోతే టీవీ ఆపేస్తా: సెహ్వాగ్
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఒక్క శ్రేయస్ అయ్యర్ మినహా మిగతావారెవ్వరూ బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయారు. ఇక బౌలింగ్‌లోనూ రాణించలేకపోవడంతో తొలి టీ 20 ఇంగ్లండ్ జాబితాలో చేరిపోయింది. అయితే తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. టీ 20లలో మంచి రికార్డు ఉండి హిట్‌మ్యాన్‌గా పేరున్న రోహిత్‌కు ఎందుకు విశ్రాంతి ఇచ్చారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ ఉంటే మ్యాచ్ ఫలితం […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఒక్క శ్రేయస్ అయ్యర్ మినహా మిగతావారెవ్వరూ బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయారు. ఇక బౌలింగ్‌లోనూ రాణించలేకపోవడంతో తొలి టీ 20 ఇంగ్లండ్ జాబితాలో చేరిపోయింది.
అయితే తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. టీ 20లలో మంచి రికార్డు ఉండి హిట్‌మ్యాన్‌గా పేరున్న రోహిత్‌కు ఎందుకు విశ్రాంతి ఇచ్చారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘రోహిత్ శర్మ ఉంటే, అతన్ని జట్టులో ఉంచాలి. రోహిత్ వంటి ఆటగాళ్లను చూడటానికి స్టేడియంకు పబ్లిక్ వస్తుంది. నేను కూడా రోహిత్‌కి అభిమానిని. రోహిత్ మ్యాచ్‌లో లేకపోతే నా టీవీ ఆపేస్తాను’ అంటూ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.