బాబ్రీ కూల్చివేతకు 29 ఏళ్లు.. మథురలో హై అలెర్ట్..
దిశ, వెబ్ డెస్క్: బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి సరిగ్గా 29 సంవత్సరాలు పూర్తి అయింది. అయితే ఏటా డిసెంబర్ 6 న భద్రతా బలగాలు అయోధ్యలో పహరా కాస్తాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. బాబ్రీ మసీదును కూల్చిన రోజును ముస్లిం లు బ్లాక్ డే గా జరుపుకుంటారు. విశ్వహిందూ పరిషత్ వాళ్లు అదే రోజును శౌర్య దివాస్ గా జరుపుకుంటారు. 2018 లో సుప్రీం తీర్పు వచ్చేదాకా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే […]
దిశ, వెబ్ డెస్క్: బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి సరిగ్గా 29 సంవత్సరాలు పూర్తి అయింది. అయితే ఏటా డిసెంబర్ 6 న భద్రతా బలగాలు అయోధ్యలో పహరా కాస్తాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. బాబ్రీ మసీదును కూల్చిన రోజును ముస్లిం లు బ్లాక్ డే గా జరుపుకుంటారు. విశ్వహిందూ పరిషత్ వాళ్లు అదే రోజును శౌర్య దివాస్ గా జరుపుకుంటారు. 2018 లో సుప్రీం తీర్పు వచ్చేదాకా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే ఉండేవి. సోమవారం కూడా భద్రతా బలగాలు అయోధ్యను తమ కంట్రోల్ లోకి తీసుకున్నాయి.
అయోధ్య వివాదం ముగిసింది అనుకునే లోపే ఇంకో సమస్య పుట్టుకు వచ్చింది. ఇంత వరకు రామ జన్మభూమి మీద వివాదం నడవగా.. ఇప్పుడు కృష్ణుడి జన్మస్థలం మీద మొదలైంది. మథురలో శ్రీకృష్ణుడి పుట్టిన చోట మసీదు ఉందని అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం పెడతామని అఖిల భారత హిందూ మహా సభ ప్రకటించింది. శ్రీకృష్ణుడి ఆలయానికి ఆనుకునే షహీ ఈద్గా మసీదు ఉంది. అదే శ్రీకృష్ణుడి జన్మస్థలం అని వివాదం నడుస్తోంది. మథురలో సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలకు పర్మీషన్ కోరగా పోలీసులు నిరాకరించారు.
అఖిల భారత హిందూ మహాసభ, నారాయణి సేన, శ్రీకృష్ణ ముక్తి దళ్, శ్రీకృష్ణ జన్మభూమి నిర్మాన్ న్యాస్, లు ఈ వేడుకలు నిర్వహించాలి అని చూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మథురకు వచ్చే అన్ని రైళ్లను నిలిపివేశారు. బస్సు సర్వీసులను కూడా నాలుగు రోజులు నిలిపివేశారు.