ఐదో రోజుకు చేరుకున్న సమ్మె
దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పరిధిలోని పసునూరు గ్రామ శివారులో ఉన్న స్టెర్లింగ్ విల్సన్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన సమ్మె ఐదు రోజులకు చేరుకుంది. నాలుగు ఏళ్ల క్రితం ఈ కంపెనీలో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇందులో ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డ్స్ షిఫ్టుల ప్రకారం పనిచేస్తూ నెలకు ఎనిమిది వేల జీతం తీసుకుంటున్నారు. అయితే గత మూడు నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వారు ఆరోపించారు. […]
దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పరిధిలోని పసునూరు గ్రామ శివారులో ఉన్న స్టెర్లింగ్ విల్సన్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన సమ్మె ఐదు రోజులకు చేరుకుంది. నాలుగు ఏళ్ల క్రితం ఈ కంపెనీలో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇందులో ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డ్స్ షిఫ్టుల ప్రకారం పనిచేస్తూ నెలకు ఎనిమిది వేల జీతం తీసుకుంటున్నారు. అయితే గత మూడు నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వారు ఆరోపించారు. దీంతో చేసేదేమీ లేక గత ఐదు రోజులుగా కంపెనీ ముందు సమ్మెకు దిగారు. కంపెనీ యాజమాన్యం తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని సెక్యూరిటీ గార్డ్స్ వాపోయారు.