KTR : కారు దిగి స్కూటీ ఎక్కిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎప్పుడూ ఏదోకటి చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎప్పుడూ ఏదోకటి చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా శుక్రవారం సాయంత్రం ఆయన తన కాన్వాయ్ వదిలేసి స్కూటీ పట్టారు. ఇంతకీ ఆయన స్కూటీ ఎందుకు నడిపారో వివరాల్లోకి వెళితే.. ముస్లింల పవిత్ర రంజాన్(Ramzan) మాసం సందర్భంగా ఎక్కడ చూసినా ఇఫ్తార్(Iftar) విందులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్(Secundrabad) నియోజకవర్గంలోని వారాసిగూడ(Warasiguda)లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముస్లిం నేతలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయనకు ఆహ్వానం అందింది.
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్(Padmarao Goud) కూడా ఆయనకు తోడవ్వడంతో ఇద్దరూ కలిసి కారు దిగి స్కూటీ ఎక్కారు. సికింద్రాబాద్ లోని పద్మారావు నివాసం నుంచి వారాసిగూడ వరకు ఇద్దరూ.. మరికొంతమంది కార్యకర్తలతో కలిసి స్కూటీ మీద ప్రయాణించారు. ఈ మార్గంలో పలువురిని కేటీఆర్, పద్మారావు పలకరించారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ రద్దీని నియంత్రించే పనిలో పడ్డారు. కేటీఆర్ స్కూటీ నడుపుతూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.