సచివాలయం మసీదు డిజైన్ ఓకే.. నేడు శంకుస్థాపన

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సచివాలయంలో నిర్మించబోయే మసీదుకు డిజైన్ తయారు అయింది. పాత సచివాలయాన్ని కూల్చివేసిన సందర్భంగా అక్కడి రెండు మసీదులు, ఒక హిందు దేవాలయం కూడా కనుమరుగు కావడంతో కొత్తగా వాటిని నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. నూతన సచివాలయం నిర్మాణపు పనులు దాదాపు కొలిక్కి వస్తున్న సమయంలో మసీదు డిజైన్ కూడా ఖరారైంది. సుమారు 1500 చ.అ. విస్తీర్ణంలో రెండు మసీదులను నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని హోం […]

Update: 2021-11-24 14:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సచివాలయంలో నిర్మించబోయే మసీదుకు డిజైన్ తయారు అయింది. పాత సచివాలయాన్ని కూల్చివేసిన సందర్భంగా అక్కడి రెండు మసీదులు, ఒక హిందు దేవాలయం కూడా కనుమరుగు కావడంతో కొత్తగా వాటిని నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. నూతన సచివాలయం నిర్మాణపు పనులు దాదాపు కొలిక్కి వస్తున్న సమయంలో మసీదు డిజైన్ కూడా ఖరారైంది. సుమారు 1500 చ.అ. విస్తీర్ణంలో రెండు మసీదులను నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆ ప్రాంతాన్ని హోం మంత్రి మహమూద్ ఆలీ బుధవారం సందర్శించారు. జామియా నిజామియా ఛాన్సెలర్ మౌలానా ముఫ్తీ ఖలీల్ ఆహ్మద్ చేతుల మీదుగా రెండు కొత్త మసీదుల నిర్మాణానికి గురువారం మధ్యాహ్నం జోహార్ నమాజు పూర్తయిన తర్వాత శంకుస్థాపన జరగనున్నది. ఈ కార్యక్రమానికి మజ్లిస్ పార్టీ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. త్వరలో హిందు దేవాలయానికి సంబంధించిన డిజైన్, శంకుస్థాపన, నిర్మాణం పనులు మొదలుకానున్నాయి.

Tags:    

Similar News