బామ్మకు కారు.. శాంటా సర్‌ప్రైజ్

దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్ పండుగ ఒక్కరోజు జరుపుకున్నా..ఆ పండుగ వచ్చే డిసెంబర్ నెలంతా సంబురాల్లో మునిగి తేలుతారు. ఎన్నో జ్ఞాపకాలు, ఎంతో సంతోషాన్ని అందించే క్రిస్మస్.. ‘శాంటా’ రూపంలో బోలెడు బహుమతులు కూడా అందిస్తుంది. సీక్రెట్ శాంటా ఇచ్చే బహుమతులు కొందరినీ నిజంగా ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అమెరికాలోని ఇదాహో ప్రాంతంలో ఆరేళ్లుగా సీక్రెట్ శాంటా ఇస్తున్న బహుమతులు స్థానికుల ప్రశంసలందుకోవడంతో పాటు, మనసును తడిచేస్తున్నాయి. ఈ ఏడాది కూడా సీక్రెట్ శాంటా తన బహుమతుల పరంపరను కొనసాగించిగా, […]

Update: 2020-12-25 03:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్ పండుగ ఒక్కరోజు జరుపుకున్నా..ఆ పండుగ వచ్చే డిసెంబర్ నెలంతా సంబురాల్లో మునిగి తేలుతారు. ఎన్నో జ్ఞాపకాలు, ఎంతో సంతోషాన్ని అందించే క్రిస్మస్.. ‘శాంటా’ రూపంలో బోలెడు బహుమతులు కూడా అందిస్తుంది. సీక్రెట్ శాంటా ఇచ్చే బహుమతులు కొందరినీ నిజంగా ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అమెరికాలోని ఇదాహో ప్రాంతంలో ఆరేళ్లుగా సీక్రెట్ శాంటా ఇస్తున్న బహుమతులు స్థానికుల ప్రశంసలందుకోవడంతో పాటు, మనసును తడిచేస్తున్నాయి. ఈ ఏడాది కూడా సీక్రెట్ శాంటా తన బహుమతుల పరంపరను కొనసాగించిగా, ఓ 65 ఏళ్ల బామ్మకు అందించిన బహుమతి మాత్రం అందరీ హృదయాలను హత్తుకుంది. ఇంతకీ ‘శాంటా’ ఆమెకు ఏం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు?

ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, కన్నీళ్లున్నా..కొంతమంది మాత్రం తమ చిరునవ్వుతో తమ బాధలను ప్రపంచానికి తెలియనివ్వకుండా, అందరినీ ఆనంద పెట్టడంలో తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇదాహో ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు డయానా బోల్డ్‌మ్యాన్ కూడా అంతే. ఆమె భర్త కెమెరన్ దివ్యాంగుడు కావడంతో, ఇంటిని పోషించే బాధ్యతను బోల్డ్ మ్యాన్ తీసుకుంది. ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ మెక్‌డొనల్డ్స్‌లో ఆమె ఉద్యోగం చేయడంతో పాటు, ఉదయం న్యూస్ పేపర్లు డెలివరీ చేస్తోంది. ఇందుకోసం ఆమె ఓ పాత వ్యాన్ వాడుతోంది. ఇలా ఆరు పదుల వయసులో తన భర్త కోసం తీరిక లేకుండా కష్టపడుతున్న బోల్డ్ మ్యాన్ కష్టానికి ఇన్నాళ్లకు శాంటా రూపంలో ప్రతిఫలం దక్కింది. మంచి చేసేవాళ్లకు మంచే జరుగుతుందనే మాటను వాస్తవం చేసేలా..బోల్డ్‌మ్యాన్ కష్టం గమనించిన ‘సీక్రెట్ శాంటా’.. ఆమెకు 5వేల డాలర్ల (రూ.3.7 లక్షలు) విలువైన గ్యాస్ కార్డులు, వెయ్యి డాలర్లు (రూ.74 వేలు) చెక్కుతో కూడిన గిఫ్ట్‌బాక్స్ అందించడంతో పాటు, హ్యుండాయ్ టక్సన్ కారు బహుమతిగా అందించి క్రిస్మస్ వెలుగులు తీసుకొచ్చాడు. ‘సీక్రెట్ శాంటాకు నా ధన్యవాదాలు. నా కార్ కీస్ నా కంటే స్మార్ట్‌గా ఉన్నాయి’ అని బోల్డ్ మ్యాన్ సంతోషంతో తెలిపింది.

సీక్రెట్ శాంటా ఏటా వీటిని ఓ న్యూస్ రిపోర్టర్ ద్వారా సదరు వ్యక్తులకు అందజేస్తుంటాడు. ఈ ఏడాది కూడా ఆ రిపోర్టర్ ద్వారానే క్రిస్మస్ కానుకలను బోల్డ్ మ్యాన్‌తో పాటు, ఇదాహో ప్రాంత ప్రజలకు అందించాడు. సీక్రెట్ శాంటా గతేడాది దాదాపు 3.7 కోట్ల రూపాయల విలువైన బహుమతులు అందజేయగా, 2017లో ఎమ్యోట్రోఫిక్ లాటెరల్ సెరోసిస్ (ఏఎల్ఎస్) అనే వ్యాధితో పడుతున్న ఇదాహో ప్రాంత వాసికి ఏడున్నర లక్షల రూపాయల సాయం అందించారు. కానుకల కోసం ఒకటిన్నర కోట్ల రూపాయలు వెచ్చించాడు. సాయం అవసరమైన వారికే ఈ సీక్రెట్ శాంటా హెల్ప్ చేస్తుండటంతో అతడిని దేవుడిలా భావిస్తారు ఇదాహో వాసులు.

Tags:    

Similar News