ఇదేం పెళ్లి గోలరా బాబూ.. లవ్, మేనరికం ఆపై రివేంజ్!
దిశప్రతినిధి, కరీంనగర్ : ప్రస్తుత సమాజంలో పెళ్లిళ్లకు పెద్దగా వాల్యూ లేకుండా పోయింది. పాశ్చాత్య సంస్కృతి ముసుగులో పెళ్లికి ముందు.. ఆ తర్వాత రిలేషన్స్ పెట్టుకోవడం, సహజీవనానికి కొందరు అలవాటు పడుతున్నారు. దీంతో కొత్తగా సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. 2007వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ వ్యక్తి ఎవరికీ తెలియకుండా పదేళ్ల వరకు గుట్టుగా కాపురం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంట్లో వారి ప్రోద్భలంతో […]
దిశప్రతినిధి, కరీంనగర్ : ప్రస్తుత సమాజంలో పెళ్లిళ్లకు పెద్దగా వాల్యూ లేకుండా పోయింది. పాశ్చాత్య సంస్కృతి ముసుగులో పెళ్లికి ముందు.. ఆ తర్వాత రిలేషన్స్ పెట్టుకోవడం, సహజీవనానికి కొందరు అలవాటు పడుతున్నారు. దీంతో కొత్తగా సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. 2007వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ వ్యక్తి ఎవరికీ తెలియకుండా పదేళ్ల వరకు గుట్టుగా కాపురం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంట్లో వారి ప్రోద్భలంతో మేనరికం సంబంధం చేసుకున్నాడు. ఇటీవల ప్రేమ పెళ్లి గురించి రెండో భార్యకు తెలియడంతో పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సీపీ సత్యనారాయణ కథనం ప్రకారం..
మురళీ కృష్ణ అనే వ్యక్తి 2007లో మమతను ప్రేమ వివాహం చేసుకుని దాదాపు పదేళ్ల పాటు కాపురం చేశాడు. 2017లో తన మేన మరదలిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల తరువాత ఈ విషయంపై రెండో భార్య దివ్య స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండో భార్య కేసు నమోదు చేసినప్పటి నుండి మురళి కృష్ణ తిరిగి మొదటి భార్య మమతతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఈ నెల 4న దివ్య సోదరులు, వారి స్నేహితుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు మొదటి భార్య మమత ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో మానసిక వేదనకు గురైన మురళి కృష్ణ రెండో భార్య దివ్య కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నానికి యత్నించింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్న క్రమంలో అప్రమత్తమైన పోలీసులు పోలీస్ వాహనంలో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. కాగా, మమత ఫిర్యాదు మేరకు రాజశేఖర్, శ్రీధర్, నితిన్‌లతో పాటు వారి స్నేహితుడు ఫిరోజ్‌లపై లైంగిక దాడి కేసు నమోదు చేశామని రామగుండం సీపీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.