సరూర్ నగర్ స్టేడియంలో కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : మమహబూబ్ నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండవ ప్రాధాన్యతా ఓట్లలో 100 ఓట్లకంటే తక్కువ వచ్చిన 17 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. దీంతో బీజేపీకి 23, టీఆర్ఎస్ కు 46 , స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 24 , కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డికి 15 ఓట్లు లభించాయి. 17 మంది […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : మమహబూబ్ నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండవ ప్రాధాన్యతా ఓట్లలో 100 ఓట్లకంటే తక్కువ వచ్చిన 17 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. దీంతో బీజేపీకి 23, టీఆర్ఎస్ కు 46 , స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 24 , కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డికి 15 ఓట్లు లభించాయి.
17 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన మొత్తం ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ 1,04,691, టీఆర్ఎస్ 1,12,735, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 53,634, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 31,569, ఓట్లతో ఉన్నారు.