రెండో రోజు పాక్‌ పైచేయి

కరాచి: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఆడుతున్న తొలి టెస్టులో రెండో రోజైన బుధవారం పాకిస్తాన్ పైచేయి సాధించింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం నుంచి కరాచి వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా 220 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అదే రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్, ఆట ముగిసే సమయానికి 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఓవర్ నైట్ స్కోరు 33/4తో రెండోరోజైన […]

Update: 2021-01-27 10:35 GMT

కరాచి: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఆడుతున్న తొలి టెస్టులో రెండో రోజైన బుధవారం పాకిస్తాన్ పైచేయి సాధించింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం నుంచి కరాచి వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా 220 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అదే రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్, ఆట ముగిసే సమయానికి 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఈ క్రమంలో ఓవర్ నైట్ స్కోరు 33/4తో రెండోరోజైన బుధవారం ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్, సౌతాఫ్రికా బౌలర్లకు ధీటుగా బదులిచ్చింది. అజర్ అలీ(51), ఫవాద్ అలాం(109) కీలక సమయంలో జట్టును ఆదుకున్నారు. వీరితోపాటు 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫహీమ్ అష్రఫ్(64) ఉత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో రెండోరోజు ముగిసేసరికి పాకిస్తాన్ జట్టు 308/8తో పటిష్ట స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 88 పరుగుల ఆధిక్యంతో ఉంది.

సంక్షిప్త స్కోరు బోర్డు:

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 220 ఆలౌట్
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 308/8

Tags:    

Similar News