ఏపీ సీఎస్ వర్సెస్ సీఈసీ

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య స్థానిక ఎన్నికల వివాదం ముదురుతోంది. అంతకు మందు సీఎస్ నీలం సాహ్ని రాసిన లేఖకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సమాధానమిచ్చారు. ఎన్నికల సంఘం ప్రతిపత్తిని ఎలా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు. రాజ్యాంగ వ్యవస్థను కించపర్చడమే అన్నారు. మీ లేఖ చట్ట విరుద్ధమని నిమ్మగడ్డ రమేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్ఈసీకి సీఎస్ నీలం సాహ్ని […]

Update: 2020-11-17 21:49 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య స్థానిక ఎన్నికల వివాదం ముదురుతోంది. అంతకు మందు సీఎస్ నీలం సాహ్ని రాసిన లేఖకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సమాధానమిచ్చారు. ఎన్నికల సంఘం ప్రతిపత్తిని ఎలా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు. రాజ్యాంగ వ్యవస్థను కించపర్చడమే అన్నారు. మీ లేఖ చట్ట విరుద్ధమని నిమ్మగడ్డ రమేష్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కరోనా కేసుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్ఈసీకి సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. రాష్ట్రంలో పోలీసులు, అధికారులు కరోనా వీధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు తెలియజేస్తామని లేఖలో వెల్లడించారు.

Tags:    

Similar News