క్షుద్రపూజల గొయ్యిలోనే కూతురి కోసం వెతుకులాట

దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాల్లో బాలిక మిస్సింగ్ మిస్టరీగా మారింది. అదృశ్యమై నాలుగు రోజులు గడుస్తున్నా.. నేటికీ ఆచూకీ లభించలేదు. మరోవైపు బాలిక మిస్సింగ్‌ పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటికే ఆ బాలిక కోసం తెలంగాణ, ఆంధ్రా పోలీసులు రెండు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకు బాలిక తనకు తానే వెళ్లిపోయిందా.. లేక మాంత్రికులు కిడ్నాప్ చేశాడా.. లేక గుప్త నిధుల కోసం బలి ఇచ్చారా అనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఈ మిస్సింగ్‌ […]

Update: 2020-12-21 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాల్లో బాలిక మిస్సింగ్ మిస్టరీగా మారింది. అదృశ్యమై నాలుగు రోజులు గడుస్తున్నా.. నేటికీ ఆచూకీ లభించలేదు. మరోవైపు బాలిక మిస్సింగ్‌ పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటికే ఆ బాలిక కోసం తెలంగాణ, ఆంధ్రా పోలీసులు రెండు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకు బాలిక తనకు తానే వెళ్లిపోయిందా.. లేక మాంత్రికులు కిడ్నాప్ చేశాడా.. లేక గుప్త నిధుల కోసం బలి ఇచ్చారా అనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఈ మిస్సింగ్‌ కేసు జిల్లాలో చర్చ శంసనీయంగా మారింది.

ధనంపై ఆశ ఓ బాలికను మాయం చేసింది. గుప్త నిధుల కోసం ఆరాట పడిన తల్లిదండ్రుల చెంత నుంచి బాలిక చేజారిపోయింది. లంకె బిందెలు ఉన్నాయని ఇంట్లో తిసిన గొయ్యిలోనే తమ బిడ్డ కోసం వెతుక్కుంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లకు చెందిన వెల్లంకి వెంకట్రావు, రాణి దంపతుల కుమార్తె (16) వరంగల్‌లో నివసిస్తున్న తన బాబాయి వెల్లంకి నాగేశ్వరరావు వద్ద ఉంటోంది. ఆ ఊర్లోనే నివసిస్తున్న గద్దె నర్సింహారావు (నాగేశ్వరరావు మామ) పశువుల వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో పూజలు చేయించుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెనికి చెందిన ప్రకాశ్ శర్మ బెంగళూరులో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆయనను నాగేశ్వర్ రావు కలవడంతో నీ జాతకంలో కొన్ని గ్రహాలు అడ్డుపడుతున్నాయి. వాటిని తొలగించాలంటే ఇంట్లో పూజలు చేయాలని తెలిపాడు. వారం రోజుల క్రితం రేమిడిచర్లకు వచ్చిన ఆయన మీ ఇంట్లో లంకె బిందెలున్నాయని, అవ్వి దక్కాలంటే ఇంట్లో 20 అడుగుల మేర సొరంగం తవ్వాలని చెప్పాడు. అక్కడ ఓ బాలికను నరబలి ఇస్తే ఫలితం ఉంటుందని కూడా చెప్పడంతోపాటు మిస్సింగ్ అయిన బాలికతోనే క్షుద్రపూజలు చేయించినట్లు సమాచారం. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకూ కూడా తెలుసనే ప్రచారం జరుగుతోంది.

అయితే పూజల అనంతరం బాలిక తల్లిదండ్రులు ఈ నెల 17న గుంటూరు జిల్లా పెద్ద కాకానిలోని గుడికి వెళ్లారు. గురువారం రాత్రికి బాలికకు అనారోగ్యంతో ఉండడంతో క్షుద్రపూజల వద్దనే ఉంచి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం దర్శనం ముగించుకోని వచ్చిన తల్లిదండ్రులకు బాలిక ఆచూకీ లభించలేదు. దీనిపై నర్సింహారావు దంపతులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారు . అదే సమయంలో క్షుద్ర పూజలుకు వచ్చిన పూజారులు కూడా కనిపించక పోవడంతో బాలిక తల్లి ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులకు ‘తాను పైచదువుల నిమిత్తం ఇల్లు విడిచి వెళ్తున్నానని’బాలిక ఇంగ్లిష్‌లో రాసిన లేఖ ఆమె ఇంట్లో దొరికింది. విషయం తన స్నేహితురాలు శరణ్యకు తెలుసని, చదువు పూర్తయిన తర్వాత తిరిగి వస్తానని అందులో పేర్కొంది. ఈ లేఖ బాలికనే రాసిందా, లేక బలవంతంగా రాయించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శరణ్యను విచారించగా, మహారాష్ట్రలోని అంబాని ఆశ్రమానికి వెళ్తానని బాలిక చెప్పినట్లు వివరించింది. బాలిక మొబైల్‌ను లొకేషన్‌ ట్రేసింగ్‌ చేస్తున్నారు. బాలికని నరబలి ఇచ్చారా లేక తనే ఇంటి నుంచి వెళ్లిపోయిందా.. మాంత్రికులు వేరే ప్రాంతాలకు తమ వెంట తీసుకెళ్లారా..అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు క్షుద్ర పూజారి ప్రకాశ్ శర్మ ఫోన్ కూడా స్విచ్ఛాప్ వస్తోంది. దీంతో గ్రామంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షద్ర పూజారులు బాలికను తీసుకెళ్లి ఏమన్నా చేశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక లేదా ప్రకాశ్ శర్మ ఫోన్లు ఆన్ అయితే ఈ కేసులో కొంత మిస్టరీ వీడే అవకాశం ఉంది.

Tags:    

Similar News